Traffic signals on mars photo by nasa

nasa, nasa address, nasa photos, nasa scientists, nasa tests, nasa website, latest news, science and technology, isro, isro address, isro scientists, isro photos, isro satelites, insat, pslv, mom, mangalyan, mars, space center, astrology, earth, curiosity, mars surface, aliens, aliens videos, latest news, traffic signals

nasa machine curiosity sent photo to earth station that resembles with a traffic signal on the mars surface : curiosity rover sent photo to nasa a traffic signal on the mars surface but nasa not announced that is a traffic signal

ఏలియన్స్ కూ ట్రాఫిక్ సిగ్నల్లుంటాయి : ఫొటో

Posted: 09/26/2014 04:25 PM IST
Traffic signals on mars photo by nasa

భూమ్మీదే కాదు... మిగతా గ్రహాలపై కూడా ట్రాపిక్ ఇబ్బందులు ఉంటాయా... అనే ఆలోచనకు స్పష్టతలేని సమాధానం అయితే  ఒకటి దొరికింది. అంగారక గ్రహంపై కూడా ట్రాఫిక్ సిగ్నళ్లు ఉంటాయని. అదెలా అంటే.., ఈ ఫొటో చూస్తే మీకే అర్ధం అవుతుంది. ఇందులో మార్క్ చేసి ఉన్న చోటును చూస్తే.., అది ట్రాఫిక్ సిగ్నల్ అనక మానరు. నాసా పంపిన క్యూరియాసిటీ రోవర్.., అంగారక గ్రహంపై ఈ ఫొటోను తీసి పంపింది. దీన్ని చూసిన నాసా శాస్ర్తవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రోవర్ పంపిన ఫొటోను మీడియాకు చూపించారు. అదే ఈ ఫొటో.

ఫొటోలో ఉన్న పొడవాటి రూపం ట్రాఫిక్ సిగ్నల్ ను పోలి ఉంది. దీంతో మళ్ళీ ఏలియన్స్ అంశం తెరపైకి వచ్చింది.  ఏలియన్స్ ఉన్నారని నమ్ముతున్న వారంతా.., ఇది వారు ఉపయోగించే ట్రాఫిక్ సిగ్నల్ అంటున్నారు. టెక్నాలజి ప్రకారం మనుషుల కంటే ఏలియన్స్ ఎంతో ముందున్నారని పలువురు విశ్లేషకులు తెలిపారు. అలాంటి ఏలియన్స్ చాలా కాలం క్రితమే వీటిని వాడిఉంటారని ఫొటోను చూస్తే అర్ధం అవుతుందన్నారు. అయితే ఈ ఫొటోలో ఉన్నది ట్రాఫిక్ సిగ్నల్ అని.., దీన్ని ఏలియన్స్ వాడారు అని నాసా మాత్రం దృవీకరించలేదు.

ఈ ఫొటోను నాసా ప్రస్తుతం పరిశీలనలో పెట్టింది. ఈ మద్య పంపిన ఓ ఫొటోలో మనిషి నీడ కన్పించటంతో అది కూడా ఏలియన్ అని మళ్ళీ ప్రచారం తెరపైకి వచ్చింది. నిజంగా గ్రహాంతర వాసులు ఉన్నారా.. లేరా..? అనేది స్పష్టంగా నిరూపించబడలేదు. కాని చాలామంది ఏలియన్స్ అలియాస్ గ్రహాంతర వాసులు ఉన్నారు అని చెప్తుంటారు. భూమి లాంటి గ్రహాలు ఈ విశ్వంలో ఇంకా ఉన్నాయి అని అంటున్నపుడు.., మనుషుల్ని పోలిన వారు కూడా ఉంటారు కదా అని వారు వాదిస్తున్నారు. దీంతో ఏలియన్స్ గురించి తెలియాలంటే ముందు క్యూరియాసిటి మరిన్ని ఫొటోలు పంపితే.. వాటిలో ఏముంటుందో తెలుసుకోవాలనే క్యూరియాసిటి ఇప్పుడే మొదలవుతోంది.

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nasa  curiosity  aliesns  traffic signal  

Other Articles