Shilpa shetty security vehicle car missed accident

shilpa shetty, shilpa shetty wiki, shilpa shetty marriage, shilpa shetty accident, shilpa shetty latest, shilpa shetty raj kundra, shilpa shetty hot, shilpa shetty family, shilpa shetty baby, bouncers, latest news, tollywood, bollywood, raj kundra wiki, punjab, amritsar, jalandhar

actress shilpa shetty car just miissed and safely escaped from a accident in punjab only car back side glass breaked : shilpa shetty escaped from a accident in punjab

శిల్పశెట్టి దంపతుల కారు ప్రమాదం

Posted: 09/26/2014 05:28 PM IST
Shilpa shetty security vehicle car missed accident

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. భర్త రాజ్ కుంద్రాతో కలిసి.. ఓ స్టోర్ ను ప్రారంభించేందుకు పంజాబ్ లోని అమృత్ సర్ కు వెళ్తుండగా.., ధిల్వాన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శిల్పాశెట్టి సెక్యురిటీ కారును మరొక కారు ఢీ:కొట్టింది. ఈ ఘటనలో కారు అద్దాలు ద్వంసం అయ్యాయి. అయితే అదృష్ట వశాత్తు ఎవరికి గాయాలు కాలేదు. ప్రమాదం జరగిన వెంటనే కారణమైన కారు యజమానితో శిల్ప బౌన్సర్లు గొడవ పడ్డారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

అటు ఇదంతా జరుగుతుండగానే.., ఘటనా స్థలం నుంచి శిల్ప వెళ్ళిపోయింది. షో రూం ప్రారంభం పని పూర్తయ్యాక.., ప్రమాదంపై పోలిసులకు ఫిర్యాదు చేసింది. అజాగ్రత్తగా నడుపుతూ తమ కారును ఢీ: కొట్టారని కంప్లయింట్ ఇచ్చింది. ప్రమాదంకు కారణమైన కారు డ్రైవర్ పై చర్య తీసుకోవాలని పోలిసులను కోరింది. అయితే అవతలి వర్గం వచ్చి శిల్పతో మాట్లాడి విషయం సెటిల్ చేసుకున్నారు. దీంతో వివాదం ఇక్కడితో ముగిసిపోయింది. కారు ప్రమాదంకు నష్టం భరిస్తానని అవతలి వ్యక్తి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న శిల్పాశెట్టి తెలుగులో కూడా పలు సినిమాలు చేసింది. అంతేకాకుండా ఐపీఎల్ ఒక ఫ్రాంచైజీకి ఓనర్ గా కొనసాగుతోంది. భర్త రాజ్ కుంద్రా పెద్ద బిజినెస్ మెన్. జాతీయ, అంతర్జాతీయ స్థాయి వ్యాపారాల్లో కుంద్రాకు లావాదేవీలున్నాయి.


కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shilpa shetty  raj kundra  latest news  accident  

Other Articles