Arvind cleans choked drains at prime minister house

Arvind Kejriwal, cleanliness drive, BR Camp, delhi, PM, narendra modi, swaccha Bharath

arvind kejriwal cleans choked drains near prime minister modi house

పరిశుభ్రతా కార్యక్రమాలలో పాల్గోన్న అరవిందుడు

Posted: 10/02/2014 05:03 PM IST
Arvind cleans choked drains at prime minister house

గాంధీజీ కలలు కన్న పరిశుభ్ర సమాజం దిశగా దేశాన్ని మలుపు తిప్పిన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పిలుపుతో అరవిందుడు కూడా కదిలాడు. ఎక్కడో అయితే తనకు మీడియా ప్రాముఖ్యతను ఇస్తుందో లేదో అనుకున్నాడేమో పాపం.. ఏకంగా ప్రధానమంత్రి ఇంటికి దగ్గర్లోనే టార్గెట్ ను ఎంచుకున్నాడు. ప్రధాన మంత్రి అధికార నివాసానికి సమీపంలో వున్న డ్రైనేజీ శుభ్రం చేశాడు. ఎవరా అరవిందుడనేగా.. మీ సందేహం.. ఆయనే ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షడు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.

ఢిల్లీలో ప్రజాతీర్పుకు మరోమారుః అవకాశం ఇవ్వాలని ఇప్పటికే గగ్గోలు పెట్టిన కేజ్రీవాల్.. ఇలాగైనా ప్రధాని దృష్టిలో పడి తన పంతాన్ని నెగ్గించుకునే ప్రయత్నం చేశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రధాని పిలుపుతో కదిలిన కేజ్రీవాల్ మోదీ అధికార నివాసానికి సమీపంలోని మురికివాడలో డ్రైనేజీ క్లీన్ చేశారు. పేదలు ఎక్కువగా నివసించే బీఆర్ క్యాంపు ప్రాంతంలో మురికి కాలువలను శుభ్రం చేసే పనుల్లో సఫాయి కార్మికులతో పాటు ఆయన పాల్గొన్నారు. తర్వాత వారితో కలిసి టీ కూడా సేవించారు.

బీఆర్ క్యాంపు తన నియోజకవర్గంలోనే ఉండడంతో ఆయనీ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అక్టోబర్ 2 నుంచి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నట్టు 'ఆప్' ట్వీట్ చేసింది. తమ ఎమ్మెల్యేలందరూ ఇందులో పాల్లొంటారని పేర్కొంది. తామ కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు స్పందించ లేదని సన్నాయి నోక్కులు నొక్కిన కేజ్రీవాల్.. తాము తమ పార్టీ పరంగానే పారిశుద్ద్య కార్యక్రమాల్లో పాల్గోన్నామని చెప్పాడం కొసమెరుపు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PArvind Kejriwal  cleanliness drive  BR Camp  delhi  PM  narendra modi  swaccha Bharath  

Other Articles