Rift grows between telangana congress leaders

Rift, Telangana PCC Chief, ponnala lakshmaiah, Senior leaders, jana reddy, shabbir ali, ponguleti sudhakar reddy

rift grows between Telangana pcc chief ponnala lakshmaiah and Senior leader jana reddy

టి.కాంగ్రెస్ అగ్రనేతల మధ్య భయటపడ్డ విభేధాలు..!

Posted: 10/02/2014 08:05 PM IST
Rift grows between telangana congress leaders


టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ నేత కె. జానారెడ్డి మధ్య అభిప్రాయభేదాలు బయటపడ్డాయి. రైతుల ఆత్మహత్యల అంశంపై పార్టీ వైఖరి ఎలావుండాలనే దానిపై చర్చ సందర్భంగా పోన్నాల లక్ష్మయ్యకు, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి మధ్య భేదాలు పొడచూపాయి. పొన్నాల అధ్యక్షతన జరిగిన ఈ చర్చకు జానారెడ్డి, షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకరరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి.

అన్నదాతల ఆత్మహత్యలపై కేసీఆర్ సర్కారును ఘాటుగా విమర్శించాలని షబ్బీర్, పొంగులేటి సూచించారు. వీరి వాఖ్యలతో పొన్నాల ఏకీభవించారు. అయితే నూతన రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 4 నెలలే అయినందున సంయమనం పాటించాలని జానారెడ్డి అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై పోరాడాల్సిందేనని పొన్నాల పేర్కొన్నారు. దీనితో ఏకభవించని జానారెడ్డి..ఇప్పుడే క్షేత్రస్థాయి పోరాటాలు అవసరం లేదని బదులిచ్చారు. దీంతో ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి.

ప్రస్తుత తరుణంలో ప్రభుత్వ కార్యక్రమాలను నిశితంగా గమనించాలని.. ప్రభుత్వ పోరబాట్లను మాత్రమే ఎత్తిచూపితే చాలునన్నారు. అయితే ప్రతిపక్షం హోదాలో ఇప్పటి నుంచే ప్రభుత్వంపై పోరాటం చేయాలని పోన్నాల న్నారు. పోన్నాలకు షబ్బీర్ అలి, పొంగులేటి కూడా మధ్దతు ప్రకటించారు. అయితే ఇదంతా జరిగిన తరువాత ఇద్దరూ కలసి.. తమ మధ్య అభిప్రాయ భేదాలు లేవని చెప్పకనే చెప్పేందుకు మీడియా ముందుకు వచ్చారు.

తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కొనసాగడం విషాదమని ఇరువురు నేతలు పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి అన్నారు. రుణాలు లభించకపోవడం, కరెంట్ కోతల కారణంగా పంటలు ఎండిపోవడంతో ఇప్పటివరకు 200 మందిపైగా రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. పండుగ వేళ రైతుల ముంగిట్లో చావు డప్పు మోగడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆత్మహత్యలు నివారించేలా అన్నదాతలకు భరోసా ఇవ్వాలన్నారు. రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. 25 శాతం రుణమాఫీ బ్యాంకుల్లో జమ అయినా కొత్త రుణాలు రావడం లేదని ఆరోపించారు. రుణమాఫీ జాప్యం కావడంతో రైతులు పంటబీమా అవకాశం కోల్పోతున్నారని పొన్నాల, జానారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles