Robos will smash humans in future

robot, robots, robot games, robotics, robocop, robo brain, robot developements, robo machines, robo workings, robo mans, robo brain making, robo making, robo in future, future with robots, robot cars, robot drivers, latest updates, robo science, robot technology, tokyo robos, japan robos, paypall, space ex, solar city, business news, world news updates, human life with robots, robots in human life

business man musk cautioned about robos leading in future says developing robos with a artificial brain will finally hit human beings only : if robos developed so much with brain they will lead the world and may cause for human beings life ending says musk

రోబోలతో మానవజాతి వినాశనం తప్పదు

Posted: 10/13/2014 01:56 PM IST
Robos will smash humans in future

సాంకేతిక పరిజ్ఞానం రోజుకో కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు మనుషులు గంటలు, రోజుల్లో చేసే పనిని ఇప్పుడు యంత్రాలు నిమిషాల వ్యవధిలో చేస్తున్నాయి. అయితే వీటివల్ల లాబాలెన్ని ఉంటాయో నష్టాలు కూడా అన్ని ఉంటాయి. ఉదాహరణకు యంత్రాల వల్ల పని తగ్గటం లాభమయితే.., నిరుద్యోగం పెరగటం, మనిషికి కష్టం విలువ తెలియకపోవటం, సుఖం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు నష్టాలుగా చెప్పవచ్చు. ఇప్పుడు రోబోల తరం వచ్చింది. మనుషుల్ని పోలిన మరమనుషులు మనకంటే వేగంగా పనిచేస్తున్నారు. మనుషులు ఇచ్చే ఆదేశాల ఆధారంగా పనిచేస్తున్న రోబోలు కొన్ని అయితే.., సొంతంగా తెలివి, జ్ఞానంతో పనిచేస్తున్న రోబోలు మరికొన్ని.

మనిషి అవసరాలు తీర్చుకునేందుకు ఈ రోబోలను తయారు చేస్తున్నారు. వీటిలో రోజుకో కొత్త సాంకేతిక జోడించి సరికొత్త ఆవిష్కరణలు సృష్టిస్తున్నారు. తాజాగా రోబోల కోసం కృత్రిమ మెదడులు తయారు చేస్తున్నారు. అంటే ఇవికూడా మనుషుల్లా ఆలోచించి పనులు చేయగలవన్నమాట. ఈ విషయం వినటానికి బాగానే ఉన్నా.., ఇది భవిష్యత్తులో మానవజాతినే నాశనం చేసే ప్రమాదముందంటున్నారు కొందరు. రోబోలో భవిష్యత్తులో మానవ మనుగడకు ముప్పుగా మారటం ఖాయమని ప్రముఖ వ్యాపార వేత్త ఎలాన్ మస్క్ తెలిపారు. మర మనుషులకు కృత్రిమ మెదడు అందించటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఐ రోబో’, ‘టెర్మినేటర్’ వంటి సినిమాల్లో చూపించిన దారుణాలు వాస్తవంగా జరుగుతాయని హెచ్చరించారు.

మనిషి అవసరాల కోసం రోబోలను అభివృద్ధి చేసుకుంటున్నారు. వాటిని మరింత మెరుగుపర్చాలనే ఉద్దేశ్యంతో.., మెదడులు అమరుస్తున్నారు. ఆ తర్వాత ఇవి కూడా మనిషిలా సొంతంగా ఆలోచించటం మొదలు పెడితే అది చివరకు మానవాళికే ముప్పు తెస్తుందన్నారు. సాంకేతిక పరిజ్ఞానంను ఒక పద్దతి ప్రకారం వినియోగించుకోవటం ఉత్తమం తప్ప.., మరీ ఎక్కువగా చేస్తే భవిష్యత్తులో మనకే ఇబ్బందులు తప్పవన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే రోబోలు అణ్వాయుధాలకంటే శక్తవంతమైనవి అన్నారు. అణ్వాయుధాల వల్ల మంచి ఎంతగా జరుగుతుందో చెడు అంతకంటే ఎక్కువే జరుగుతుంది అన్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : robot  human life  musk  technology  

Other Articles