మహారాష్ట్రలో ప్రజా తీర్పు వెలువడినా.. అధికారం ఎవరు చేపట్టనున్నారన్నదానిపై గంటగంటకు ఉత్కంఠత తీవ్రమవుతోంది. అధికారానికి కేవలం 22 స్థానాలతో దూరంగా వున్న బీజేపికి ఇది నిజంగా విషమ పరీక్షే. ఓటరు తీర్పును శిరసావహిస్తామని చెప్పే పార్టీలు.. ఇప్పుడెలా ఈ పరిస్థితిని అధిగమించనున్నాయి. మహారాష్ట్రంలో అధికారాన్ని చేపట్టే అవకాశం కూడా కేవలం బీజేపికి మాత్రమే వుంది. రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన శివసేన ఏదేని రెండు పార్టీలు మద్దతు ఇస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వుంది. ఈ రెండు పార్టీలే కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయన్న వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు ఈ విషయాన్నిరెండు పార్టీల నేతలు ఎవ్వరూ ధృవీకరించకపోవడంతో ఉత్కంట కోనసాగుతోంది. మరోవైపు బీజేపి ఎవరి మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనందన్న ఊహాగాలు వినిపిస్తున్నాయి. ఎవరి మద్దతుతో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారన్న విషయంపై రాష్ట్రంతో పాటు అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
రాష్ట్ర ప్రయోజనాలు, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కోసం బీజేపీకి బయటి నుంచి ఎన్సీపీ మద్దతు ప్రకటించినా.. ఆ మద్దతును బీజేపి తిరస్కరించింది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎట్టి పరిస్థితుల్లో ఎన్సీపీ మద్దతు తీసుకోబోమని స్పష్టం చేసింది. ఎన్సీపీతో పొత్తు పెట్టుకుంటే ఓటేసిన ప్రజలతో పాటు, తమను కూడా అవమానపరుచుకున్నట్లేనని అభిప్రాయపడింది. కాగా పాతమిత్రులైన శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీకి ఆర్ఎస్ఎస్ సూచించింది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందా...? శివసేన మద్దతు తీసుకుంటుం దా...? లేదా చిన్న పార్టీలతో పాటు ఇండిపెండెంట్ల సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా అన్న విషయం తేలాల్సి ఉంది.
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కన్నేసి ఉంచిన శివసేన ఆచి తూచి అడుగులు వేస్తోంది. షరుతలతో కూడిన మద్దతుకు ఆ పార్టీ సిద్దమన్న సంకేతాలను పంపింది. అధికారంలో కీలక శాఖలు లభించినట్లయితే బీజేపీకి మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు శివసేన తెలిపింది. అయితే బీజేపీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని, ఒకవేళ వచ్చినట్లయితే ప్రతిపాదనను పరిశీలించి తమ నిర్ణయాన్ని తెలుపుతామని శివసేన నాయకులు పేర్కొంటున్నారు.
బీజేపీ ఒంటరిగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న ధీమాను ఆ పార్టీ జాతీయ నాయకుడు రాజీవ్ ప్రతాప్ రూడీ వ్యక్తం చేశారు. తమకు 122 స్థానాలు ఉన్నాయని, దీంతో పాటు మిత్ర పక్షాలు, ఇండిపెండెంట్లు ఇతర చిన్న పార్టీలు తమకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అధికారాన్ని చేపట్టేందుకు 145 మ్యాజిక్ ఫిగర్ అవసరం లేదని, అతిపెద్ద పార్టీగా అవతరించడమే చాలన్నారు. ఈ నేపథ్యంలో బీజేపి, శివసేన జతకడుతాయా లేదా..? బీజేపి ఒంటరిగానే అధికారన్ని దక్కించుకుంటుందా..? లేక ఎటూ తేలక ఢిల్లీ అసెంబ్లీ పరిణామాలే ఇక్కడా.. పునరావృతం అవుతాయా..? అన్న సందిగ్ధత ప్రజల్లో నెలకొంది. వీటన్నింటినీ తొలగించడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more