Comet siding spring buzzes mars but nasa orbiters and rovers are safe

comet, mars, NASA ,space, mom, mission on mars, isro, Siding Spring

Comet Siding Spring buzzes Mars, but NASA orbiters and rovers are safe

మామ్ సహా మార్స్ అర్బిటరీలన్ని ఫథిలం..

Posted: 10/21/2014 10:39 AM IST
Comet siding spring buzzes mars but nasa orbiters and rovers are safe

ఖగోళంలో అద్భత సన్నివేశం.. అంగారక గ్రాహానికి అతి చేరువగా వచ్చిన తోక చుక్క.. సైడింగ్ స్ట్రింగ్ మార్స్ గ్రహానికి అతిచేరువగా వచ్చి హలో చెప్పి వెళ్లింది. గత రెండు రోజులుగా కునుకు తీయని ఖగోళశాస్త్ర పరిశోధకులను మాత్రం ఊపిరి పీల్చుకున్నారు. అంగారక గ్రహానికి అతిచేరువగా వచ్చిన సైడింగ్‌ స్ర్పింగ్‌ తోకచుక్క చివరికి ఎలాంటి నష్టం చేయకుండానే వెళ్లిపోవడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. దీంతో పలు అంతరిక్ష పరిశోధన సంస్థలు ఆనందాన్ని వ్యక్తం చేశాయి.

అంగారక గ్రహానికి చేరువగా తోకచుక్క రావడమేంటి..? శాస్త్రవేత్తల ఆనందానికి సంబంధమేంటనుకుంటున్నారా..? కుజగ్రహంపై జీవరాసులు వుండేందుకు వీలు వుందా..? అసలక్కడ ఏముంది. ? ఎలా వుంది.? నీటి లభ్యత వుందా ఇలాంటి సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకనేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. అయితే వారు నేరుగా అక్కడకు వెళ్లలేరు గనుక వేల కోట్ల రూపాయలను ఖర్చుపెట్టి భూమిపై నుంచి ఉపగ్రహాలను పంపారు. అవి తీసే ఫోటోలు, ఇచ్చే సమాచారాన్ని బట్టి శాస్త్రవేత్తలు పరిశోధనలు సల్పుతున్నారు. అయితే తోకచుక్క వల్ల అంగారకుడిపై వున్న ఐదు ఉపగ్రహాలకు ముప్పు వాటిల్లుతుందేమోనన్న అందోళన పరిశోధకులలో నెలకొనుండేది. అయితే సైడింగ్ స్ట్రింగ్ ఆర్బిటరీలకు ఎలాంటి నష్టం చేయకుండా వెళ్లడంతో వారు ఊపిరి పీట్చుకున్నారు. మార్స్ పైకి పంపిన అర్బిటరీలలో భారత్ పంపిన మామ్ మాత్రమే అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది.

అయితే కుజుడి మీద పరిశోధన నిమిత్తం పంపిన ఆర్బిటర్లన్నీ సురక్షితంగా ఉన్నట్లు నాసా ప్రకటించింది. కిలోమీటర్‌కు పైగా విస్తీర్ణంతో, పెద్ద పర్వతమంత సైజులో, కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతితో.. గంటకు 2 లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన సైడింగ్‌ స్ర్పింగ్‌ (సీ/2013ఏ1) తోకచుక్క.. గ్రీనిచ్‌ కాలమానం ప్రకారం 2గంటల 27 నిమిషాలకు అంగారకుడికి 1,39,500 కిలోమీటర్ల దూరం నుంచి దూసుకెళ్లింది. ఇప్పటి వరకూ ఏ తోకచుక్కా అంగారకుడికి ఇంత దగ్గరగా రాలేదని ఇస్రో, నాసా సంస్థలు నిర్ధారించాయి. అత్యంత దగ్గరగా తోకచుక్క గమనాన్ని చిత్రీకరించిన అక్కడి రోబోలు పంపే చిత్రాల కోసం పరిశోధకులు ఎదురుచూస్తున్నారు.

సౌర వ్యవస్థకు బయట కోట్ల సంవత్సరాలుగా పేరుకుపోయిన మంచు, దుమ్ము, భారీ గ్రహ శకలాలను పెద్ద ఎత్తున మోసుకొచ్చిన ఈ తోకచుక్క రాకతో... కుజుడి వాతావరణంపై వచ్చిన మార్పులను గమనిస్తున్నట్లు నాసా తెలిపింది. ఈ అనుభవం రాబోయే రోజుల్లో కుజుడిపై వచ్చే మరిన్ని సవాళ్లను అధిగమించటానికి దోహదపడుతుందని నాసా అభిప్రాయపడింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : comet  mars  NASA  space  mom  mission on mars  isro  Siding Spring  

Other Articles