Firm gives diwali bonanza to its employees

Diamond industry, Surat, Hari Krishna Exports Company, Diwali

surat diamond firm gifts 491 cars 200 two bedroom houses jewellery to 1200 staff

తన ఉద్యోగుల కళ్లలో ఆనందం చూశాడా.. బాస్..!

Posted: 10/21/2014 10:57 AM IST
Firm gives diwali bonanza to its employees

దీపావళి పండగను అందరూ ఘనంగానే జరుపుకుంటారు. రెక్కడితే కాని డొక్కాడని పేదలు కూడా అవసరమతే అప్పలు చేసైనా పండగ జరుపుకుంటారు. అందరి సంగతి పక్కనబెడితే.. ఆ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రం ఇంకా ఘనంగా జరుపుకుంటారు. మరోలా చెప్పాలంటే.. ఈ పండగా వారి జీవితాలలోనే కొత్త కాంతులను నింపింది. అదేలా అంటారా.. తమ సంస్థ అధినేత ధీపావళి ధమాకాను అందజేశారు కాబట్టి.  మీకు తెలుసుకోవాలని వుందా..?

సూరత్‌కి చెందిన హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్ సంస్థలో పనిచేసే 1,200 మంది ఉద్యోగులు ఈసారి మాత్రం దీపావళిని మరింత ఘనంగా జరుపుకోనున్నారు. కంపెనీ ఏకంగా 491 ఫియట్ పుంటో కార్లు, 200 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు.. ఇంకా ఆభరణాలు మొదలైనవి తమ ఉద్యోగులకు పండుగ కానుకగా అందించాడు వారి బాస్. తమది వజ్రాల వ్యాపారమైనా.. తనది వజ్రంలా కఠినమైన మనస్సు కాదని నిరూపించాడు. ఉద్యోగుల కళ్లలో ఆనందం చూశాడు.. గడిచిన అయిదేళ్లుగా అత్యుత్తమ పనితీరు కనపర్చి, సంస్థ వృద్ధికి తోడ్పడిన ఉద్యోగులను ప్రోత్సహించే ఉద్దేశంతో వీటిని అందించినట్లు సంస్థ సీఎండీ సావ్‌జీ ఢోలకియా తెలిపారు.

ఈ ప్రోత్సాహకాల విలువ దాదాపు రూ. 50 కోట్లు ఉంటుందని, తాము సాధారణంగానే దీపావళి సందర్భంలో ఇలాంటి  బోనస్‌లు అందిస్తూనే ఉంటామని ఆయన వివరించారు. 1991లో ఏర్పాటైన హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్ వార్షిక టర్నోవరు రూ. 5,000 కోట్లు కాగా.. బెల్జియం, హాంకాంగ్, ఇంగ్లండ్ తదితర దేశాల్లో కంపెనీ కార్యకలాపాలు ఉన్నాయి. కంపెనీలో 6,000 మంది పైచిలుకు సిబ్బంది ఉండగా 1,200 మందికి ప్రోత్సాహకాలకు అర్హత సాధించినట్లు ఢోలకియా వివరించారు. దీపావళికి బోనస్ ఇవ్వడం పలు ప్రైవేటు కంపెనీలకు సాధారణమే అయినా.. స్వీట్లు, టపాసులు పంచిపెట్టినట్లు డోలకియా కార్లు, నగలు పంచిపెట్టారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Diamond industry  Surat  Hari Krishna Exports Company  Diwali  

Other Articles