Two ships drown in sea during hudhud cyclone at vishakhapatnam

hudhud, andhra pradesh, vishakapatnam, Two ships, survey of india, shipping corporation of india, dm singh, sagar parachimi, officials

Two ships drown in sea during hudhud cyclone at vishakhapatnam

హుదూద్ ధాటికి సముద్రంలో మునిగిపోయిన రెండు నౌకలు..

Posted: 10/26/2014 01:57 PM IST
Two ships drown in sea during hudhud cyclone at vishakhapatnam

హుధుద్ తుఫాను ధాటికి విశాఖపట్నం సహా ఉత్తర కోస్తా జిల్లాలు అతలాకుతలం కావడంతో తదనంతర సహాయక చర్యల్లో నిమగ్నమైన అధికార యంత్రాగం, తమ ఇళ్లను పరిశుభ్రంగ మలుచుకోవడంలో స్థానిక ప్రజానికం నిమగ్నం అయ్యారు. ఇఫ్పుడిప్పుడూ వారు తుఫాను సృష్టించిన బీభత్సం గురించి చర్చించుకుంటున్నారు. తుఫాను వల్ల తమ ఇళ్లలో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సముద్ర వీక్షణం కలిగిన అపార్టుమెంట్ వాసులు తుఫాన్ తీరాన్ని తాకిన సమయంలో ఆ బీభత్సాన్ని కిటీనీ నుంచి వీక్షించారట.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వ ఆదేశాలతో అక్కడ యంత్రాంగం ముందుగానే విద్యుత్ సరఫరాను నిలిపిేసింది. దీంతో కరెంటు లేక, టీవీలు చూడలేక కిటీకీల గుండా సముద్రాన్ని చూస్తు వుండిపోయారట ఆ అపార్టుమెంటు వాసులు. ఇంతలో సముద్రంలో రెండు నౌకలు మునిగిపోయే దృశ్యాన్ని వారు చూశారట. అయితే వారు నిజంగా చూశారా లేదా అనే విషయాన్ని పక్కన బెడితే.. తుపాను ధాటికి రెండు నౌకలు మాత్రం సముద్రంలో మునిగాయన్నది మాత్రం వాస్తవమని అధికారులే చెబుతున్నారు.

సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన సాగర్ పర్చిమి నౌకతో సహా. మరొకటి షిప్పింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన డీఎం సింగ్. నౌకలు సముద్ర గర్భంలోకి జారుకున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఇవి నౌకకన్నా చిన్నపరిణామంలో, పడవ కన్నా పెద్దవైనవిగాను వున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు.. హుధుద్ తీరాన్ని తాకే సమయానికి ఫిషింగ్ హార్బర్‌లో ఉన్నాయని, అందుచేతనే అవి మునిగిపోయాయని అధికారులు స్పష్టం చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles