Telangana government to proceed with day long assembly sessions keeping an end to single day proceedngs

Telangana government, proceed, day long, assembly sessions, single day proceedngs, Telangana CM KCR, assembly speaker madhusudhnana chary, governer narasimhan

Telangana government to proceed with day long assembly sessions keeping an end to single day proceedngs

ఇకపై రెండు పూటలా అసెంబ్లీ సమావేశాలు

Posted: 10/29/2014 09:03 AM IST
Telangana government to proceed with day long assembly sessions keeping an end to single day proceedngs

మునుపటి సంప్రదాయాలకు భిన్నంగా వెళుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అసెంబ్లీ సమావేశాల నిర్వహణలోనూ పాత సంప్రదాయాలకు తిలోదకాలిచ్చేశారు. శాసనసభలో అర్థవంతమైన చర్చలకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో సమావేశాలను రోజంతా నిర్వహించేందుకు తీర్మానించారు. సాధారణంగా ప్రత్యేక పరిస్థితుల్లో తప్పించి అసెంబ్లీ సమావేశాలు ఒక్క పూట మాత్రమే జరుగుతాయి. అందుకు భిన్నంగా తెలంగాణ శాసనసభను రోజంతా సమావేశపరిచి, ప్రజా సమస్యలపై సమగ్ర చర్చ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు.

సమావేశాల నిర్వహణపై మంగళవారం రాత్రి మంత్రులు హరీశ్ రావు, ఈటెల రాజేందర్ తదితరులతో భేటీ అయిన ఆయన పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఇకపై సమావేశాలను ఉదయం, మధ్యాహ్నం నిర్వహించడంతో పాటు శనివారం కూడా సమావేశాలు కొనసాగించనున్నారు. గత సంప్రదాయాలకు భిన్నంగా సమావేశాల తొలిరోజే రాష్ట్ర బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ చర్యతో బడ్జెట్ పై అర్థవంతమైన చర్చ జరగడమే కాక ప్రజలకు తాము సమగ్రమైన వివరణ ఇచ్చేందుకు అవకాశం చిక్కుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. సభలో ప్రతి ఎమ్మెల్యే, తన నియోకవర్గ సమస్యలు లేవనెత్తేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన నిర్ణయించారు.

తెలంగాణ రాష్ట్రం కోత్తగా ఏర్పడినందున గంతోని చట్టాలను మార్చి వాటి స్థనంలో కొత్త చట్టాలను తేవడంపై సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.  కొత్త చట్టాలకు సంబంధించి రోజూ సాయంత్రం చర్చ జరుగుతుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. చట్టాలపై మార్పుపై ప్రతిపాదనలు రూపొందించాలని ఆయన ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా శాసనసభా సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ మేరకు నవంబర్ 5 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీతో పాటుగా శాసనమండలి సమావేశాలు కూడా ప్రారంభంకానున్నాయి. రాష్ట్ర గవర్నర్ నరసింహాన్ అమోదం లభించడంతో శాసనసభ వ్యవహారాల శాఖ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles