Central government to reveal all the black money accont holders names to supreme court in seales cover

Black money, Switzerland, India, Swiss banks, Swiss black money, government, supreme court

central government to reveal all the black money accont holders names to supreme court in seales cover

ప్రభుత్వాన్ని శాసిస్తున్న నల్లకుబేరుల మాఫియా..

Posted: 10/29/2014 10:19 AM IST
Central government to reveal all the black money accont holders names to supreme court in seales cover


విదేశీ బ్యాంకుల్లో కోట్ల కొలది డబ్బును దాచిన భారతీయ నల్లకుభేరులు ప్రభుత్వాలనే శాషిస్తున్నారు. భారతీయలు శ్రమనంతా ధనరూపంలోకి మార్చిన ఈ నల్లకుబేరులు ఒక మాపియా మాదిరిగా తయారైయ్యారు. విదేశీ బ్యాంకుల్లో వున్న తమ డబ్బు వివరాలు తెలపకూడదంటూ ప్రభుత్వంపైనే ఒత్తిడి తీసుకువస్తున్నారు. 120 కోట్ల మంది భారతీయులకు చెందిన సంపాదనను వారి ఆర్జితమంటూ.. అక్రమ మార్గాల ద్వారా దేశీయ సరిహద్దులు దాటించి.. తాము సామాన్య సంపన్నులమేనన్న భ్రమలు కల్పింస్తున్నారు.

ఇన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీని శాసించిన వీళ్లు, ఇప్పడు బీజేపి ప్రభుత్వాన్ని కూడా శాసించేస్థాయికి వచ్చారు. సార్వత్రిక ఎన్నికల ముందు నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామని ఇచ్చిన  హామీని నిలబెట్టుకునేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం...ఆపసోపాలు పడుతోందంటే నల్లకుభేరుల ప్రభావం ఎంతగా వుందో అర్థమవుతోంది. అమెరికాలాంటి అగ్రరాజ్యానికి వెళ్లిన ప్రధాని మోడీ.. తన సత్తాను చాటి భారతీయత గొప్పదనాన్ని చాటిచెప్పారు. అయితే అలాంటి ప్రధాని హయాంలో, ఆయన ఇచ్చిన హామీ మేరకు నల్లధన కుబేరుల వివరాలను బయటపెట్టడంలో ఎన్డీఏ ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది.

భారత్‌తో ద్వంద్వ పన్నుల నిరోధక ఒప్పందం (డీటీఏఏ) చేసుకున్న దేశాల నుంచి నల్లధనంపై అందిన సమాచారాన్ని బహిర్గతం చేయలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలపడం.. నలధన కుబేరుల వివరాలు భయటపెడితే ప్రత్యర్థి కాంగ్రెస్ ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న మేకపోతు గాంభీర్యాన్ని కేంద్ర ప్రదర్శిస్తుందే తప్ప.. నిజానికి నల్లధన కుబేరుల జాబితాను భయపెట్టడంలో ఇంకా ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందో అర్థం కావడం లేదు. చివరకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట కేంద్ర ప్రభుత్వంపై అక్షింతలు వేయడంతో కేంద్ర అర్థిక మంత్రి ఇవాళ నల్లధన కుబేరుల వివరాలను న్యాయస్థానానికి అందజేస్తామన్నారు.

భారతీయుల విదేశీ ఖాతాలకు సంబంధించి ప్రభుత్వానికి దాదాపు 500 మంది పేర్లు అందాయని, ఇందులో జర్మనీసహా పలు దేశాల్లోని ఖాతాల వివరాలున్నట్లు కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ న్యాయస్థానానికి వెల్లడించిన సందర్భంలో కోర్టు ప్రభుత్వంపై తీవ్రవ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం సొంతంగా ఎలాంటి దర్యాప్తూ జరపాల్సిన అవసరం లేదని ఒకవేళ అలా జరిగితే... నల్లధన కుబేరుల అంశం జీవితకాలంలో కూడా అది పూర్తికాదని అనుమానాన్ని వ్యక్తం చేసింది. ఖాతాదార్లకు సంబంధించిన సమాచారాని ఇవ్వాలని, ఎవరితో దర్యాప్తు జరిపించాలనేది తాము చూసుకుంటామని వ్యాఖ్యానించింది. కొందరు ఖాతాదారుల పేర్లను ఇచ్చి చేతులు దులుపుకోవద్దని హితవు పలికింది.

అంతా అయిన తరువాత న్యాయస్థానం ఆదేశాల మేరకు నల్లకుబేరుల జాబితానంతటినీ కోర్టుకు సమర్పిస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. సుప్రీం వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. ప్రభుత్వానికి ఎవ్వరినీ కాపాడే ఉద్దేశం లేదన్నారు. సుప్రీం చెప్పినట్లుగా సీల్డు కవర్‌లో జాబితాను ఇచ్చేస్తాం. ఇప్పటికే ఈ లిస్టును సుప్రీం నియమించిన సిట్‌కు జూన్ 27నే సమర్పించామన్నారు. తాము చట్టప్రకారం నడుచుకుంటామని.. కోర్టుకు కూడా జాబితా ఇవ్వడంలో ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందీ లేదని జైట్లీ తేల్చిచెప్పారు. అక్రమంగా నల్లధనం పోగేసిన ఖాతాదారులందరినీ శిక్షించాలన్న దృఢనిశ్చయంతో ప్రభుత్వం ఉందని.. నల్లధనాన్ని వెనక్కి రప్పించేందుకు సాయశక్తులా కృషిచేస్తామని కూడా జైట్లీ పేర్కొన్నారు. అయితే, ఈ పేర్లన్నింటినీ ప్రభుత్వం ప్రజలకు బహిర్గతం చేస్తుందా లేదా అనేది మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. ఎప్పటికైనా దేశ సరిహద్దులను దాటించి అక్రమంగా దాచిన నల్లధన కుబేరుల వివరాలు భయటకు వస్తాయని ఆశిద్దాం..

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Black money  Switzerland  India  Swiss banks  government  supreme court  

Other Articles