Whats up with whatsapp facebook reveals record ad revenue but admits the messaging app it bought for 19bn lost 138mn last year

WhatsApp, Facebook, ad revenue, $138mn, $19bn, 1.35 billion users, third quarter, Social network, net loss, Mark Zuckerberg

Whats up with WhatsApp? Facebook reveals record ad revenue - but admits the messaging app it bought for $19bn lost $138mn last year

ఫేస్ బుక్ కు రికార్డుస్థాయి లాభాలు.. వాట్సఅప్ కు నష్టాలు..

Posted: 10/29/2014 08:30 PM IST
Whats up with whatsapp facebook reveals record ad revenue but admits the messaging app it bought for 19bn lost 138mn last year

ఫేస్ బుక్ సామాజిక వెబ్ సైట్.. ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో గణనీయమైన లాభాలను ఆర్జించింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 1.35 బిలియన్ మంది నెలవారి వినియోగదారులు సుమారుగా 1.35 బిలియన్లకు చేరారు. వీరిలో 86.4 కోట్ల మంది ప్రతిరోజు ఫేస్ బుక్ ను వినియోగిస్తున్నారని సంస్థ వర్గాలు వెల్లడించాయి. దరిమిలా.. ఈ సామాజిక వైబ్ సైట్ అడ్వర్టైసింగ్ రూపేన గత రెండో త్రైమాసిం కన్నా 64 శాతం వృద్దిని  సాధించింది. సుమారుగా 2.96  బిలియన్ డాలర్లను పేస్ బుక్ మూడో త్రైమాసికంలో ఆర్జించింది.

అయినా.. ఈ సంస్థ ఎదుగుదలకు ఓ అంశం విపరీతంగా ఇబ్బందులు పెడుతోంది. గణనీయమైన లాభాలను అర్జించన తరుణంలోనూ ఇబ్బందికర పరిణామాలు ఏమింటంటే.. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ఫేస్ బుక్ తరహాలోనే సంచలనం సృష్టించిన మరో అప్లికేషన్.. వాట్సాప్. ఇటీవలే ఈ యాఫ్ ను ఫేస్ బుక్ 19 బిలియన్ డాలర్లకు కోనుగోల చేసింది. అయితే ఈ యాప్ 2013 ఆర్థిక సంవత్సరానికి కేవలం 10 మిలియన్ డాలర్ల రెవెన్యూ మాత్రమే ఆర్జించడం.. ఫేస్ బుక్ యాజమాన్యాన్ని కలవరపరుస్తోంది. ఇక ఈ ఏడాది ఏకంగా ఇప్పటి  వరకు 138 మిలియన్ డాలర్ల నష్టాన్ని కూడా మూటగట్టుకుంది.

ఫేస్ బుక్ లాభాలను ఆర్జించడంపై ఆ సంస్థ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ మాట్లాడుతూ.. మూడో త్రైమాసికం తమకు చాలా మంచిగా వుందని అభిప్రాయపడ్డారు. తమకు అన్ని రకాలుగా మంచి ఫలితాలు వచ్చాయన్నారు. మొబైల్ ఆడ్ రెవెన్యూలో నశితంగా ఫరిశీలిస్తే.. 1.95 బిలియన్ డాలర్ల లాభం వచ్చిందని, గతంతో పోల్చితే మొత్తం ఫేస్ బుక్ ఆడ్ రెవెన్యూలో ఈ త్రైమాసికంలో 66 శాతం వృద్ది సాధించామని ఆయన వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో 59 శాతం, రెండో త్రైమాసికంలో 62 శాతం కన్నా మూడో త్రైమాసికంలో 66 శాతం మేర వృద్ది సాధించామన్నారు.

పదేళ్ల క్రితం స్థాపించిన ఈ సంస్థ గత రెండేళ్ల కిందట నుంచే మొబైల్ యాడ్ ఇవ్వడం ప్రారంభించిందన్నారు. త్వరలోనే ఫేస్ బుక్ అత్యంత లాభదాయకమైన వీడియో యాడ్స్ ను కూడా విస్తరింపజేస్తామన్నారు. మార్కెటింగ్ రంగ నిపుణులకు దోహదపడేందుకు ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ చేసిన అట్లాస్ సహా, రైలు ప్రస్తుతం ఎక్కడుందన్న సమాచారాన్ని తెలిపే లైవ్ రైల్ ఆన్ లైన్ వీడియో అడ్వర్టైమెంట్ ప్లాట్ ఫాం సిగ్నల్ కూడా విస్తరించనున్నట్ల సంస్థ డైరెక్టర్ దేబ్ర అహో విలియంసన్ తెలిపారు. ఫేస్ బుక్ సామాజిక వైబ్ సైట్ తో పాటు అనేక లక్ష్యసాదన డిజిటల్: సర్వీసులను అందించనుందన్నారు. సంస్థ త్రైమాసిక ఫలితాలు వెల్లడైన తరువాత 81.16 డాలర్లకు షేర్ విలువ పెరిగిందని, ఇది తొలుత ఇచ్చిన పబ్లిక్ ఇష్యూకి 38 డాటర్లకు సుమారుగా రెండింతలకు చేరిందన్నారు.

అయితే ఊహించిన స్థాయిలో వాట్సాప్ యాస్ ఫలితాలను ఇవ్వలేకపోయిందని, ఇది మాత్రం 138  మిలియన్ డాలర్ల నికర నష్టాన్ని మూటగట్టుకుందని డైరెక్టర్ దేబ్ర అహో విలియంసన్ తెలిపారు. ప్రస్తుతం ఈ యాప్ అడ్వర్టైజ్ మెంట్లన్లు ప్రవేశపెట్టలేదని, అందుకు తోందరపడాల్సిన పనిలేదన్నారు. వాట్సాప్ యాప్ దీర్ఘకాలం వాణిజ్యంలో భాగమని, అప్పుడే లాభాలను అర్జించడం కష్టమన్నారు. ముందుగా ఈ యాప్ ద్వారా వినియోగదారులు ఆకర్షించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తానికి డివిడెంట్ల రూపంగా ప్రతీ షేర్ విలువకు 30సెంట్టలను ఇచ్చిన తరువాత 802 మిలియన్ డాలర్లను మూడవ త్రైమాసికంలో ఆర్జించింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles