మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన శుక్రవారం రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు ఆహ్వానించారని, ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని అక్టోబర్ 31 తేదిగా నిర్ణయించామని దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. 15 రోజుల్లోగా బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ సూచించినట్టు ఆయన మీడియాకు వెల్లడించారు.
అయితే బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మద్దతు ఇచ్చిన శివసేన లేదు లేదంటూనే మంత్రి పదవులపై కన్నేసింది. మంత్రివర్గంలో బెర్తుల కోసం శివసేన ప్రతిపాదనల్ని పంపినట్టు సమాచారం. శివసేన, బీజేపీల మధ్య ఈ మేరకు ప్రత్యేక సమావేశం జరుగుతున్నట్లు సమాచారం. కాగా క్రీయాశీలక మంత్రిపదవులను తమ వద్ద అట్టేపెట్టుకుని అంత ప్రాముఖ్యత లేని పదవులను శివసేనకు ఇవ్వాలని బీజేపి ఇప్పటికే నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే శివసేనను కాదని సోంతంగా బలనిరూపణకు సిద్దమని మహారాష్ట్రలో బీజేపిని అతిపెద్ద పార్టీగా అవతరింపజేయడంలో క్రీయాశీలక పాత్ర పోషించిన ఫెడ్నవిస్ వద్ద శివసేన కూడా సానుకూల చర్చల ద్వారానే పదవులను పొందాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రిగా పెడ్నవిస్ ప్రమాణ స్వీకరం చేస్తున్న సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలను తెలియజేస్తున్నాం. తొలినాళ్లలో ఫెడ్నివిస్ వస్త్రాలకు మోడల్గా పనిచేశారు. అయితే, అందుకు ఒక్క పైసా కూడా తీసుకోలేదు. తన స్నేహితుడి కోసం ఆయన ఈ పని చేశారు. కొన్ని నెలల పాటు ఆయన ఈ దుస్తులు వేసుకున్న ఫొటోలు నాగ్పూర్ నగరం మొత్తం బాగా కనిపించాయి. అయితే ఇక్కడ కూడా ఫెడ్నవిస్ తన భారతీయ సంస్కృతిని ఉట్టిపడేలాగా రాజుల వేషాధరణలో వస్తాలనే ధరించారు. ఒకానొక సమయంలో లండన్ వెళ్లి న్యాయవిద్య చదవడం కోసం రాజకీయాలు వదిలేద్దామని దేవేంద్ర ఫడ్నవిస్ భావించారు. సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేయాలన్నది ఆయన కల. కానీ, స్నేహితులు ఆందుకు నిరాకరించడంతో ఆగిన ఆయనకు మహారాష్ట్రకు ముఖ్యమంత్రి అయ్యే చాన్స్ లభించింది.
దేవేంద్ర భార్య అమృత యాక్సిస్ బ్యాంకులో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం నాగ్పూర్లో పనిచేస్తున్న ఆమె.. ఇప్పుడు ముంబైకి బదిలీ చేయించుకుంటున్నారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఉండబోయే అత్యంత పిన్నవయస్కురాలిగా దేవేంద్ర ఫడ్నవిస్ కుమార్తె దివిజ రికార్డు సృష్టించబోతున్నారు. ఆమెకు ఇప్పుడు ఐదేళ్లు మాత్రమే. ఇంతకుముందు శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే పిన్న వయస్కురాలిగా ఉండేవారు. సీఎం నివాసంలో ప్రవేశించేసరికి ఆమె వయసు తొమ్మిదేళ్లు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more