Hyderabad eflu student gang raped

eflu student, gang rape, hyderabad, co-students, agitations, Crime, Telangana

hyderabad eflu student gang raped

సహవిద్యార్థినిపై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన మగమృగాళ్లు

Posted: 11/02/2014 05:36 PM IST
Hyderabad eflu student gang raped

హైదరాబాద్ నేరాలకు అడ్డగా మారుతోంది. అఘాయిత్యాలకు, అత్యాచారాలకు కేంద్రంగా మారుతోంది. ప్రేమించలేదని ఒకడు, ప్రేమ పేరుతో వంచించి మరోకడు, అందంగా వుందని అత్యాచారం చేసేవాడు ఇంకోకడు. హైదరాబాద్ నగరంలో అమ్మాయిల భద్రత కరువవుతోంది. తమపై జరుగుతున్న అఘాయిత్యాలకు ఎలా సమాధానం చెప్పాలో తెలియక, ఇంటి నుంచి బయలకు వచ్చేందుకు కూడా అమ్మాయిలు జంకుతున్నారు. బయటికి వెళ్లిన తమ ఇంటి ఆడపడుచులు క్షమంగా ఇంటికి తిరిగి వస్తారా..? లేదా.? అన్న ఆందోళన అమ్మాయిల తల్లిదండ్రులు నానాటికీ పెరుగుతోంది.

మొన్న అభయ, ఆ తరువాత మరెన్నో.. అమ్మాయిలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో అడపడచులను వేధించే వాళ్ల కళ్లు పీకుతానని, ఇందుకోసం అవసరమైతే.. ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తానన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినా.. కన్నూ మిన్నూ కానకుండా.. కామంతో ఆడపడులపై బడుతున్నారు మగమృగాళ్లు. హైదరాబాద్ లో అంతర్జాతీయ తరహాలో పోలిసింగ్ వ్యవస్థను తీసుకువచ్చి. మద మృగాళ్ల ఆటలను కట్టివేస్తామని హెచ్చరించినా కామాంధులు ఇంకా చెలరేగిపోతున్నారు.

తాజాగా, ప్రతిష్టాత్మక ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)కి చెందిన ఓ విద్యార్థినిపై అగంతకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. ఈ మేరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సహచర విద్యార్థులే తన పాలిట మగమృగాళ్లుగా మారి అత్యాచారం చేశారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అక్టోబర్ 31న ఇద్దరు సహచర విద్యార్థులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం అసుపత్రికి పంపారు. కాగా, సహచర విద్యార్థినిప అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

జి,మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : eflu student  gang rape  hyderabad  co-students  agitations  Crime  Telangana  

Other Articles