Mouse hunt delays new york bound flight by 5 hours

mouse, Norwegian airline, flight, cockpit, pilot, New york

mouse hunt delays new york bound flight by 5 hours

వామ్మో.. గజాసురుడి వాహనం.. భారీ విమానాన్ని ఆపింది..

Posted: 11/02/2014 09:06 PM IST
Mouse hunt delays new york bound flight by 5 hours


భారీ విహాంగాన్ని ఆపింది ఆ గణపతి వాహనం. నమ్మశక్యంగా లేదా..? నిజంగానే .చిట్టి ఎలుక భారీ విమానాన్ని నిలిపివేసింది. కాంబొడియాలో ఉన్న కడాయ్ లోకి ఎలుకల్ని వేయించుకుని తింటున్నారన్న సమాచారం అందుకుందో ఏమో.. అ విషయాన్ని విదేశాలలో వున్న తమ వారికి చెప్పాలని బయలుదేరింది కాబోలు. టిక్కెట్ లేకుండానే విమానంలోకి ఎక్కి ప్రయాణం చేయాలనుకుంది. ఏకంగా కాక్ పిట్ లోకి దూరేసింది. ఎలుకను గమనించిన నార్వే ఎయిర్లైన్స్ కు చెందిన  ఫైలెట్..విమానం నిలిపేశారు.

న్యూయార్క్ వెళ్లాల్సిన విమానంలో ఎలుక హల్ చల్ చేయడంతో విమానం ఆగిపోయింది. తమ దేశంలో ఇలాంటి ఘటన చోటుచేసుకున్నట్టు న్యూయార్క్ స్థానిక పత్రిక తెలిపింది. విమానం పైకి ఎగరడానికి సిద్దంగా ఉన్న సమయంలో కాక్ పిట్ లోకి ఎలుక దూరినట్టు గమనించిన సిబ్బంది దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. చివరకు ఎలాగోలా ఎలుకను పట్టుకున్నారు.

ఇంకా ఏమైనా ఎలుకలు ఉన్నాయోమోనని విమానం మొత్తం శోదించారు. ఈ నేపథ్యంలో ఐదు గంటల పాటు విమానం ఆగిపోయింది. ఎలుకలు విమానం లోపలి వైర్లను కొరికెస్తాయనే భయంతోనే వాటిని పట్టుకున్నామని సిబ్బంది వెల్లడించారు. అయితే ఎలుక వల్ల కలిగిన ఆలస్యంపై ప్రయాణికులు స్పందిస్తూ.. వామ్మో ఎలుక.. ఐదు గంటల పాటు విమానాశ్రయ సిబ్బందిని పరుగులు పెట్టించిందంటూ సరదాగా స్పందించారట.

జి,మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mouse  Norwegian airline  flight  cockpit  pilot  New york  

Other Articles