దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌కు మహారాష్ట్రలో కోలువుదీరాలంటే.. తమ డిమాండ్లను తప్పక నేరవేచ్చాలని ఉద్దవ్ థాక్రే ఆద్వరంలోని శివసేన మరోమారు బెట్టు చేస్తుంది. దీంతో మాహారష్ట్రలోని రాజకీయాలు మళ్లీ రసకందాయంలో పడ్డాయి. ఇటీవల ఎన్నికల ముందు సీట్ల సర్ధుబాటు విషయంలో తన దారి తనదేనంటూ ముందుకు సాగిన నాటి బీజేపి మహారాష్ట్ర అధ్యక్షుడు, ప్రస్తత ముఖ్యమంత్రి శివసేన డిమాండ్లను పక్కన బెడుతున్నారు. మంత్రులుగా తనతో పాటు ప్రమాణస్వీకారం చేసిన వారికి శాఖలను కేటాయించి తూకుడుగా ముందుకు సాగుతున్నారు.
మహారాష్టరలో కోలువుదీరిన మద్దతు ఇవ్వాలంటే తమకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని శివసేన డిమాండ్ పెట్టినట్టు తెలుస్తున్నది. ఫడ్నవిస్ ప్రభుత్వంలో శివసేన చేరడంపై కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్టు సమాచారం. శివసేన నేత అనిల్ దేశాయ్‌తో జైట్లీ చర్చలు జరిపినట్టు పార్టీ వర్గాల సమాచారం. ఈ చర్చల సందర్భంగా తమ డిమాండ్లను శివసేన బయటపెట్టింది. ఉపముఖ్యమంత్రి పదవితోపాటు 2:1 ఫార్ములా ప్రకారం మంత్రి పదవులు ఇవ్వాలని శివసేన అడిగినట్టు తెలుస్తోందిజ
బీజేపీ రెండు మంత్రి పదవులు తీసుకుంటే, తమకు ఒకటి ఇవ్వాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నది. అయితే తమ డిమాండ్లపై విశ్వాసతీర్మానంలోపే తేల్చాలని బీజేపీకి స్పష్టంచేసింది. తమకు ఆమోదయోగ్యమైన ఒప్పందం కుదురకపోతే బీజేపీ సర్కార్‌కు మద్దతు ఇవ్వబోమని శివసేన చెప్పినట్టు తెలుస్తున్నది. మరోవైపు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తే అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా శివసేన చేసుకుంటున్నది. ప్రతిపక్షనేత పదవి కోసం ముగ్గురు సీనియర్ నేతల పేర్లను పార్టీ అధినేత ఉద్ధవ్ పరిశీలిస్తున్నట్టు సమాచారం.
చర్చలు కొనసాగుతున్నాయి..
దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వంలో చేరడంపై బీజేపీతో సానుకూల చర్చలు జరుగుతున్నాయని శివసేన తెలిపింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రి అరుణ్ జైట్లీలతో ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం చర్చలు జరిపారని శివసేన అధికార ప్రతినిధి నీలం గోర్థే మీడియాకు తెలిపారు. ప్రభుత్వంలో శివసేన చేరడంపై ఉద్ధవ్‌దే తుది నిర్ణయమని ఆమె అన్నారు. మరోవైపు విశ్వాస తీర్మానంలో మెజారిటీ నిరూపించుకుంటామని మహారాష్ట్ర సీనియర్ మంత్రి సుధీర్ ధీమా వ్యక్తంచేశారు.
శివసేనతో కలసి బలమైన ప్రభుత్వ ఏర్పాటు: సీఎం పెడ్నవిస్
శివసేన పార్టీతో కలసి బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫెడ్నవిస్ ఆశాభావం వ్యక్తం చేశారు. నవంబర్ 12 జరగనున్న బలనిరూపణ లోపు అన్ని అంశాలు కొలిక్కి వస్తాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేతో చర్చలు జరుగుతున్నాయని... త్వరలోనే ఆ చర్చలు ఓ కొలిక్కి రానున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. శివసేన సభ్యులు తమ ప్రభుత్వంలో చేరే ప్రకటనపై సరైన సమయంలో వస్తుందన్నారు. శివసేనతో చర్చలు జరుగుతున్నాయన్నారు. ఎన్‌సీపీ, బీజేపీకి బహిరంగంగానే పొత్తు ప్రకటించినా ఆ పొత్తుకు ప్రధాని మోడీ సుముఖంగా లేరని అన్నారు. ఇక మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వ్యవహారంపై స్పందించిన ఫడ్నవీస్ అవినీతికి పాల్పడ్డ వారు తమ సొంత పార్టీ వారైనా ఉపేక్షించేది లేదని అన్నారు. మహారాష్ట్రను అభివృద్ధిలో గుజరాత్‌ను తలదన్నే రీతిలో చేస్తానని ప్రకటించారు. గుజరాత్‌ను మించిన అభివృద్ధి మహారాష్ట్రలో నమోదైతే ప్రధాని, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ కూడా సంతోషిస్తారని తెలిపారు.
సీఎంఓలో భారీ మార్పులు
ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత మోదీ తన కార్యాలయంలో మార్పులు చేసినట్టుగానే మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తన కార్యాలయంలో భారీ మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. అవినీతి రహిత పాలన కోసం మంత్రులకు సహాయం చేసేందుకు కొంతమంది అధికారులను ఎంపిక చేయనున్నట్టు ఫడ్నవిస్ మీడియాకు తెలిపారు. విదర్భ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నామని వివరించారు. అహ్మద్‌నగర్‌లో ముగ్గురు దళితుల హత్యలపై దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర డీజీపీని మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆదేశించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని తనను కలిసిన బృందానికి ఫడ్నవిస్ హామీఇచ్చారు.
మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నావిస్ తన కేబినెట్ లోని పది మంది మంత్రులకు శాఖలు కేటాయించారు. హోమ్, పట్టణాభివృద్ధి, హౌసింగ్, ఆరోగ్య శాఖలను తనవద్దే ఉంచుకున్నారు. శివసేనకు ఇచ్చేందుకే ఈ శాఖలను ఫడణ్ వీస్ తన వద్ద అట్టిపెట్టుకున్నట్టు తెలుస్తోంది.
ఏక్‌నాథ్ ఖడ్సే: రెవెన్యూ, మైనార్టీల అభివృద్ధి , వక్ఫ్, ఎక్సైజ్, వ్యవసాయం, పశుసంవర్ధకం
సుధీర్ మునగంటివార్: ఆర్థిక, ప్రణాళిక వ్యవహారాలు, అటవీ శాఖ
వినోద్ తావ్డే: పాఠశాల విద్య, క్రీడలు, ఉన్నత, సాంకేతిక, వైద్య విద్య, మరాఠీ భాష, సాంస్కృతిక వ్యవహారాలు
ప్రకాశ్ మెహతా: పరిశ్రమలు, మైనింగ్, శాసనసభ వ్యవహారాలు
చంద్రకాంత్ పాటిల్: సహకార, మార్కెటింగ్, టెక్స్టైల్
పంకజా ముండే: గ్రామీణాభివృద్ధి, నీటివనరులు, మహిళా, శిశు సంక్షేమం
విద్యా ఠాకూర్(సహాయ మంత్రి): గ్రామీణాభివృద్ధి, నీటివనరులు, మహిళా, శిశు సంక్షేమం
విష్ణు సావరా: గిరిజనాభివృద్ధి, సామాజిక న్యాయం, ప్రత్యేక సహాయం
దిలీప్ కాంబ్లే: (సహాయ మంత్రి): గిరిజనాభివృద్ధి, సామాజిక న్యాయం, ప్రత్యేక సహాయం శాఖలను కేటాయించారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more