Shiv sena in dilema on power sharing with bjp in maharastra

shiv sena ,opposition, bjp, maharastra, uddav thakre, speaker selection, devendra fednavis, Maharastra chief Minister

shiv sena in dilema on power sharing with bjp in maharastra

దాగుడుమూతలు ఆడుతున్న శివసేన.. పెరుగుతున్న ఉత్కంఠ..!

Posted: 11/11/2014 09:29 AM IST
Shiv sena in dilema on power sharing with bjp in maharastra

మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వంలో చేరడంపై శివసేన దాగుడుమూతలు ఆడుతున్నది. అధికారాన్ని పంచుకోవాలా..? లేక ప్రతిపక్షంలో కూర్చోవాలా అన్నది అర్థంకాక ఏటూతేల్చుకోలేని సందిగ్ధతతో కొట్టుమిట్టాడుతోంది. ఓ వైపు ప్రతిపక్షనేతగా ఏక్‌నాథ్ షిండేను గుర్తించాలంటూ అసెంబ్లీ కార్యదర్శి అనంత్ కల్సేకు లేఖ రాసిన ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే మరోవైపు బీజేపీతో చర్చలకు ఇంకా దారులు మూసుకు పోలేదని వ్యాఖ్యానించడంపై ఆ పార్టీలో స్పష్టత కోరవడిందని చెప్పాలి. మనస్సులో అధికారాన్ని పంచుకోవాలని వున్నా.. తమ పార్టీ ఎంపీని తమ వైపు ఫిరాయించుకున్న బీజేపి భవిష్యత్  లో మరెలాంటి చర్యలకు పాల్పడుతుందోనంటూ శివసేన భావిస్తున్నట్లు సమాచారం. తమ పార్టీ పక్ష నేత ఏక్‌నాథ్‌షిండేకు ప్రతిపక్షనేత హోదా ఇవ్వాలంటూ అసెంబ్లీ కార్యదర్శి కల్సేకు ఉద్ధవ్‌ఠాక్రే లేఖ రాశారు. ఆ తర్వాత కొద్దిగంటలకే పార్టీ కార్యకర్తలతో సమావేశంలో బీజేపీతో చర్చలకు దారులు మూసుకుపోలేదని చెప్పడం పార్టీ డొలాయమన పరిస్థతికి దర్ఫణం పడుతోంది..

అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాపై కాంగ్రెస్ కన్నేయడంవల్లే ఏక్‌నాథ్‌ను అపొజిషన్ లీడర్‌గా గుర్తించాలని లేఖ రాశానని శివసేన వివరించింది. బీజేపీతో ముందుకువస్తే చర్చలకు సిద్ధంగానే ఉన్నామని చెప్పారు. శివసేన నిర్ణయంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ప్రతిపక్షంలో కూర్చోవడం వారి హక్కుగా పేర్కోన్న శివసేనను ప్రభుత్వంలో చేరాలని ఎవరూ ఆహ్వానించలేదని బీజేపి వర్గాలు అంటున్నాయి. మహారాష్ట్ర శాసనసభలో 12న జరిగే విశ్వాస పరీక్షలో తమ పార్టీ నెగ్గుతుందని బీజేపి వర్గాలు స్పష్టంచేశాయి.

సోమవారం మొదలైన మహారాష్ట్ర ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో శివసేన ప్రతిపక్ష స్థానంలో కూర్చుంది. కాషాయ రంగు తలపాగా ధరించి గ్రూప్ గా అసెంబ్లీకి వచ్చిన శివసేన సభ్యులు ప్రతిపక్షపార్టీకి కేటాయించిన స్థానంలో ఆసీనులయ్యారు. అయితే అధికారంలో తమను చేర్చకపోతే ఎలా వుంటుందో.. శాసనసభ సమావేశాలకు ఐదేళ్ల పాటు ఎలా ఆటంకం కలిగిస్తామో చూస్కొండి అన్న విధంగా శివనేన వ్యవహరించింది. సభ కార్యక్రమాల తొలిరోజునే ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

బీజేపీ, శివసేన సభ్యులు పోటాపోటీగా నినాదాలు చేశారు. జైశ్రీరాం, జై శివాజీ నినాదాలతో అసెంబ్లీ పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి. స్పీకర్ ఎన్నిక బుధవారం మధ్యాహ్నం మూడుగంటలకు జరుగుతుందని ప్రొటెం స్పీకర్ జీవ పాండు గవిట్ ప్రకటించారు. స్పీకర్ ఎన్నిక అనంతరం అదే రోజు విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి ఫడ్నవిస్ భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు స్పీకర్ పదవికి తమ అభ్యర్థిని నిలబెట్టాలని శివసేన యోచిస్తున్నది. బీజేపీ తరఫున ఔరంగాబాద్ ఎమ్మెల్యే హరిభావూ బాగ్దే పేరును స్పీకర్ పదవికి పరిశీలిస్తున్నది.

ముంబై అభివృద్ధి కోసం చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ (సీఈవో)ను నియమించాలన్న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రతిపాదనపై శివసేన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. ముంబై అభివృద్ధికి సంబంధించి నిర్ణయం తీసుకునే ముందైనా తమను సంప్రదించాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పార్టీ పత్రిక సామ్నాలో హెచ్చరించింది.

సమస్య పరిష్కారమవుతుంది: జైట్లీ

శివసేనతో సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. రెండురోజుల్లో మద్దతుపై తేల్చకపోతే ప్రతిపక్షంలో కూర్చుంటామని శివసేన జారీచేసిన అల్టిమేటంపై జైట్లీ స్పందించారు. కొన్ని సమస్యలు వాటంతటవే పరిష్కారమవుతాయని ప్రసార సమాచారశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జైట్లీ చెప్పారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles