Man shows traces of ebola virus quarantined in delhi

Treatment, Ebola, Deihi, traces, quarantine, cure, semen, after arriving, Liberia, India, Health Ministry

Man shows traces of Ebola virus, quarantined in Delhi

ధేశంలోకి తొలి ఎబోలా రోగి.. ఢిల్లీలో నిర్భంధ చికిత్స..

Posted: 11/19/2014 06:03 PM IST
Man shows traces of ebola virus quarantined in delhi

దేశంలో తొలిసారిగా ఎబోలా కేసు నమోదైంది. లైబీరియా నుంచి భారత్ దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్ పోర్టులోకి అడుగుపెట్టిన ఓ 26 ఏళ్ల వ్యక్తిలో ఎబోలా వైరస్ అనవాళ్లు వున్నాయని వైద్యాధికారులు గుర్తించారు. బాధితుడ్ని దిల్లీ విమానాశ్రయంలో ప్రత్యేక వార్డులో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. 'నవంబరు పదో తేదీన లైబీరియా నుంచి ఢల్లీకి చేరుకున్న ఓ 26 ఏళ్ల వ్యక్తి వీర్య నమూనాలు పరీక్షించగా ఎబోలా వ్యాధి లక్షణాలు ఉన్నట్లు బయటపడింది. దీంతో ప్రత్యేకంగా ఉంచి చికిత్స అందిస్తున్నామని  కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ప్రాణాంతక వ్యాధికి సంబంధించి బాధితుడు గతంలో లైబీరియాలో చికిత్స కూడా తీసుకున్నాడని వివరించింది. అతనికి పూర్తి చికిత్సను తీసుకున్నానని,  ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం తనకు వ్యాధి లేని నిర్థారించారని బాధితుడు తెలిపినా.. అతడిని ముందస్తు జాగ్రత్త చర్యగా ఢిల్లీలోని ప్రత్యేక వార్డుకు తరలించారు. ప్రస్తుతం అతని వ్యాధి భారి నుంచి పూర్తిగా కోలుకున్నాడని పేర్కోంటూ లైబీరియా వైద్యులు జారీ చేసిన ధృవపత్రం కూడా అతని వద్ద వుందని లక్షణాలు లేవని నిర్థరించిన తర్వాత భారతకు వచ్చాడని...వైద్యాధికారులు తెలుపుతున్నారు.

అయితే ఇక్కడ జరిపిన పరీక్షల్లో ఎబోలా లక్షణాలు బపటపడ్డాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. పరిస్థితి అదుపులోనే ఉందని..ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. వ్యాధి పూర్తిగా తగ్గుముఖం పట్టేంతవరకు బాధితుడ్ని దిల్లీ విమానాశ్రయంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక వార్డులోనే ఉంచి చికిత్స అందిస్తామని ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా సదరు వ్యక్తి ఎబోలా వ్యాధిగ్రస్తుడు కాదని, వ్యాధికి చికిత్స చేయించుకున్న తరువాత వచ్చిన వ్యక్తి అని పేరు చెప్పడానికి ఇప్టపడని వైద్యాధికారి తెలిపారు.

అతడిని కేవలం ముందుస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా చికిత్సనందించి పరీక్షలు నిర్వహించనున్నామని తెలిపారు. ఎబోలా వ్యాధి తగ్గినా అతని మలమూత్రాలలో కొంత కాలం పాటు ఇంకా లక్షణాలు కనబడతాయని తెలిపారు. అతని మూత్రంలో పాజిటివ్ అని వచ్చిందే తప్ప అతనిలో వ్యాధి లక్షణాలు లేవని తెలిపారు. చికిత్స తరువాత కూడా 90 రోజుల వరకు అతని ఎవరితోనైనా సంబోగం చేస్తే వారికి వ్యాధి సోకి, అక్కడి నుంచి మరోకరికి విస్తృతంగా వ్యాధి సోకే ప్రమాదముందని, అందుచేతే అతడిని పది రోజుల పాటు పరీక్షించి వ్యాధి లక్షణాలు పూర్తిగా తగ్గిన తరువాత పంపుతామని వైద్యాధికారి తెలిపారు.

ఎబోలా వ్యాధి ప్రభావిత ప్రాంతంలో సుమారు 45 వేల మంది భారతీయులు వున్న నేపథ్యంలో  ఈ ప్రాణాంతక వ్యాధి జనసాంధ్రత కల్గిన మన దేశంలోకి రాకుండా భారత్ ఆరోగ్య శాఖ అధికారులు పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. భారత్ లాంటి దేశంలోకి ఈ వైరస్ సోకితే.. వ్యాధిభారిన పడిన వారిని కాపాడటం కష్టతరమని వ్యాధిని కనుగోన్న వారిలో ఒకరు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులలో సభ్యుడైన డాక్టర్ పీటర్ ప్యీట్ తెలిపారు. ముఖ్యంగా పారిశుద్ద్యం అంతగా లేని గ్రామీణ భారతంలో వ్యాధి పెను విధ్వంసం సృష్టించే అవకాశాలు వున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ వ్యాధి భారిన పడి ఐదు వేల 177  మంది ప్రాణాలను కోల్పోయారు. వారిలో సియోరా లియోన్, లిబేరియా, గునియా దేశస్థులే అధికంగా వున్నారు.

కాగా, రాజస్థాన్ లోని జయపుర: ఓ 35 ఏళ్ల వ్యక్తికి ఎబోలా వ్యాధి తరహా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. బాధితుడికి ఇక్కడి సవాయ్ మాన్ సింగ్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందించారు. అనుమానిత రోగిని జయపుర నగరంలోని విద్యాధర్‌నగర్‌కు చెందిన మొహమ్మద్ రెహన్ ఖాన్‌గా గుర్తించారు.జ్వరం, బొబ్బలతో ఇబ్బందిపడుతున్న ఖాన్‌ను తొలుత ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ్నుంచి సవాయ్ మాన్‌సింగ్ ఆస్పత్రికి మార్చారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత ఖాన్ బంధువులతో కలిసి దిల్లీకి బయలుదేరి వెళ్లిపోయాడని మాన్‌సింగ్ ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ సి.ఎల్.నేవల్ తెలిపారు.

ఇదిలావుండగా, ఈ విషయమై కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా స్పందిస్తూ పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నట్లు తెలిపారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడుతూ దిల్లీ విమానాశ్రయంలో ముందుగా తగు ఏర్పాట్లు చేయడం వల్ల లైబీరియా నుంచి భారత్ వచ్చిన ఓ వ్యక్తి శరీరంలో ఎబోలా వైరస్ ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. మరో 24 విమానాశ్రయాల్లోనూ ఎబోలా వైరస్‌ను గుర్తించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. లైబీరియా నుంచి ఈనెల 10న భారత్‌కి వచ్చిన 26 ఏళ్ల యువకుడు అక్కడ ఎబోలా సోకగా చికిత్స పొంది పూర్తిగా నయమయ్యాకే భారత్ వచ్చినట్లు ఆయన తెలిపారు. అతని వైద్య రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో అతనికి పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించగా ఎబోలా వైరస్ నెగెటివ్ రిపోర్టు వచ్చినట్లు తెలిపారు. అయినప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రి  జగత్ ప్రకాశ్ నడ్డా పేర్కొన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Treatment  Ebola  Deihi  traces  quarantine  cure  semen  after arriving  Liberia  India  Health Ministry  

Other Articles