Firing at kbr park what was assailant target planed to kidnap nityanada reddy

nityananda reddy, firing, Aurobindo Pharma vice president, kcr, telangana assembly, ak 47, greyhounds police, firing, kidnap

Firing at kbr park, what was Assailant target, planed to kidnap nityanada reddy..?

గురి తప్పిందా..? తప్పించాడా..? అగంతకుడి టార్గెట్ ఏంటి..?

Posted: 11/19/2014 07:55 PM IST
Firing at kbr park what was assailant target planed to kidnap nityanada reddy

తెల్లవారింది. అప్పడే మంచుమబ్బుల్లోంది సూర్యుడు భయటకు వచ్చాడు. పక్షుల కిలకిలల రాగాలు, రోడ్డుపై నడుస్తున్న కొద్దిపాటి వాహనాల చప్పుడు. ప్రశాంతంగా వున్న వాతావరణం. ఒక్కసారిగా తుపాకుల మోతతో భీతిల్లిపోయింది. అప్పడే వాకింగ్ పూర్తి చేసుకుని తన కారు వద్దకు వచ్చిన వ్యక్తిపై అదే కారులో కూర్చున మరో వ్యక్తి కాల్పులు. ఇద్దరి మధ్య కొద్ది సేపు పెనుగులాట. అంతలో పరుగుపరుగున వచ్చిన మరో వ్యక్తి ఇంకో వ్యక్తిని పట్టుకున్నాడు. అతని బారి నుంచి తప్పించుకునేందుకు మార్గం లేక చేతిని గట్టిగా కొరికి తప్పించుకు కాల్పులు జరిపిన వ్యక్తి పారిపోయాడు. ఇదంతా వింటుంటే టాలీవుడ్ సినిమాలోని ఏదో క్రైమ్ సీన్ ను చెప్పినట్లుగా వుందనుకుంటున్నారా..?

నగరం నడిబోడ్డున వున్న బంజారాహిల్స్ ప్రాంతంలోని కేబీఆర్ పార్కు వద్ద జరిగిన యదార్థ ఘటన ఇది. అప్పటి వరకు ప్రశాంతంగా వున్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కాల్పుల మోతలు కలకలం రేపాయి. కేబీఆర్‌ పార్కులో వాకింగ్‌ ముగించుకుని నిత్యానందరెడ్డి, అతని సోదరుడు కారులో బయలు దేరడానికి సిద్ధమయ్యారు. అదే సమయంలో ఓ ఆగంతకుడు ఆకస్మాత్తుగా కారులోకి ప్రవేశించి నిత్యానందరెడ్డి పాయింట్‌ బ్లాక్‌ రేంజ్‌ తుపాకీ నుంచి మిమ్మల్ని కిడ్నాప్‌ చేస్తున్నామని, సహకరించకపోతే కాల్పులు జరుపుతానని హిందీలో హెచ్చరించాడు.
 
వెంటనే అప్రమత్తమైన నిత్యానందరెడ్డి ఆత్మరక్షణ కోసం ఆగంతకుడి వద్ద ఉన్న గన్‌ను లాక్కునే ప్రయత్నం చేశాడు. దుండగుడితో నిత్యానందరెడ్డి అతని సోదరుడు పెనుగులాడటంతో దుండగుడి చేతులోని గన్‌ ఫైర్‌ అయ్యింది. సుమారు ఎనమిది రౌండ్ల బుల్లెట్లు రిలీజ్‌ అవడంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. కారు బాడీలోకి కూడా బులెట్లు దూసుకెళ్లాయి. వెంటనే ఆగంతకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. దుండగుడు కారు ముందు నుంచి పరిగెత్తుకుంటూ అన్నపూర్ణ స్టూడియో వైపు పారిపోయాడని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.
 
మరోవైపు నిత్యానందరెడ్డిపై కాల్పులకు దుండగుడు వినియోగించిన అత్యదునిక తుపాకీ ఏకే 47 పోలీస్‌శాఖకు చెందినదిగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏడాదిన్నర క్రితం విశాఖ అడవుల్లో మాయమైన గ్రేహౌండ్స్‌ ఏకే-47గా తెలుస్తోంది. గతంలో తుపాకీ మిస్సింగ్‌పై నార్సింగి పీఎస్‌లో గ్రేహౌండ్స్‌ ఫిర్యాదు చేయగా ఆయుధం అదృశ్యంపై విచారణ జరుగుతుండగా, అది నగరంలో ప్రత్యక్షమంది. అసలింతకీ నిత్యానందరెడ్డిని టార్గెట్‌ చేసింది ఎవరు.? కిడ్నాపర్లా..? లేక వ్యక్తిగత పగలా..? వాపార లావాదేవీలా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
 
నిత్యానందరెడ్డి చెప్పిన దాని ప్రకారం కారులోకి చోరబడగానే ఆగంతకుడు హిందీలో మాట్లాడడని, డబ్బుల కోసమే తనను కిడ్నాప్ చేస్తున్నట్లు చెప్పాడని తెలుస్తోంది.  అయితే సదరు కిడ్నాపర్ గతంలో మరెవరెవనీ కిడ్రాప్ చేసి వుంటాడన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విశాఖలో అదృశ్యమైన గన్ కిడ్నాపర్ వద్దకు ఎలా చేరింది. ఈ గన్ ఆదారంగా చేసుకుని ఇప్పటి వరకు దుండగుడు ఎంతమందికి కిడ్నాప్ చేశాడు..? అయితే ఎక్కడ కిడ్నాప్ లు జరిగివుంటాయన్న సందేహాలు రేకెతుతున్నాయి. నిత్యానందను కిడ్నాప్ చేసేందుకు కుట్ర పన్నినట్లు దుండగుడు స్పష్టం చేసినా.. అతడు ఒక్కడే కాకుండా అతని వెనుక మరెరైనా వున్నారా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఇదీ కాకుండా ఏడాది కాలం క్రితం పోయిన గన్ ను ఇప్పటి వరకు ఎక్కడ దాచాడు..? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

ఇక మరోవైపు ఈ ఘటనలో సస్పెండైన గ్రేహౌండ్స్ పోలీసుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు సాగిస్తున్నారు. గతంలో ఏకే-47 తుపాకీ కనిపించకుండాపోయిన కేసులో ఏడుగురిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వారే డబ్బున్న పెదాళ్లని టార్గెట్ చేసి కిడ్నాప్ కు కుట్ర పన్ని వుంటారా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. గ్రే హౌండ్స్ పోలీసులే ఈ ఘటనకు పాల్పడి వుంటే.. కానిస్టేబుల్ గా వారు తీసుకున్న తర్పీదు నేపథ్యంలో కాల్పులు గురి తప్పేవి కాదని కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే దుండగుడు కిడ్నాప్ కు కుట్ర పన్నినా.. అధి విఫలం కావడం గమనిస్తే.. అతనికి కాల్పులు జరపడం తెలియకపోవచ్చని తెలుస్తోంది. అందులోనూ తన తుపాకీ అక్కడే వదిలేసి పారిపోవడంతో దుండగుడికి నగరంపై అవగాహన వుందని తెలుస్తోంది. మరోవైపు సీసీ టీవీ ఫుటేజ్ ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆగంతకుడు ట్రాక్ షూట్, తెలుగు రంగు టీషర్టు ధరించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ ప్రకటన చేశారు. నిందితుడిని పట్టుకోడానికి మూడు ప్రత్యేక బృందాలను నియమించామని, నగరంలో శాంతిభద్రతలను కాపాడేందుకు అనుక్షణం కృషి చేస్తామని ఆయన చెప్పారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles