Narendra modis followers cross 8 million on twitter

narendra modi, twitter followers, crosses, 8 million, American President, barrack obama, pope Francis

narendra modis followers cross 8 million on twitter

మరో రికార్డును బద్దలు కోట్టిన ప్రధాని మోడీ

Posted: 11/19/2014 09:45 PM IST
Narendra modis followers cross 8 million on twitter

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ధ్వనిస్తూ, జ్వనిస్తున్న పేరు నరేంద్ర మోడీ. భారత దేశ ప్రధాన మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టకు ముందే ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. ప్రధాన మంత్రి హోదాలో మొన్న అమెరికాలో, ఇవాళ అస్ట్రేలియాలో ప్రతిధ్వనిస్తోంది. ఇక తాజాగా ప్రధాని నరేంద్రమోదీ మరో రికార్డు కూడా బద్దలుకొట్టారు. ఆయన ట్విట్టర్ ఖాతాను ఇప్పటికి 80 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. ట్విట్టర్లో ఆయన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, పోప్ ఫ్రాన్సిస్ల తర్వాత మూడో స్థానంలో నిలిచారు. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ యాజమాన్యమే ఓ ప్రకటనలో తెలిపింది.

సోషల్ నెట్వర్క్ అంటే తెలియని భారతీయులు కోట్ల మంది వున్నారు. తెలిసినా.. సాంకేతికతను అందిపుచ్చుకోని అభాగ్యులు కూడా కోట్ల లోనే వున్నారు. అయినా ప్రధాన మంత్ర నరేంద్రమోడీ నెట్ జనులలో సుస్థిర స్థానం ఏర్పర్చుకున్నారు. ఇప్పటి వరకు దేశ ప్రధానులు ఎవరూ చేయని విధంగా నెట్ జనులకు నిత్యం అందుబాటులో వుంటూ ప్రభుత్వం చేసే ప్రతి పనిని వారికి ముందుగా సమాచారం అందించడంతో నెట్ జనులు కూడా మోడీ అంటే విపరీతంగా అభిమాన్తున్నారు.

దీంతోనే ప్రపంచంలో అత్యధిక పాలోవర్లు వున్న వ్యక్తిగా మోడీ రికార్డులకెక్కారు. బరాక్ ఒబామాకు 4.3 కోట్ల మంది, పోప్ ఫ్రాన్సిస్కు 1.4 కోట్ల మంది ఫాలోవర్లున్నారు. ఇటీవలి ఎన్నికల్లో మోదీ గెలిచినప్పటి నుంచి ట్విట్టర్లో ఆయన ఫాలోవర్ల సంఖ్య రెట్టింపు అయ్యింది. ఎన్నికల్లో గెలిచినట్లు ఆయన చేసిన ట్వీట్ను మొత్తం 70,586 మంది రీట్వీట్ చేశారు. భారత దేశానికి సంబంధించి ఇది ఆల్టైం రికార్డు. ఆస్ట్రేలియా పర్యటన ముగింపు సమయంలో కూడా ఆ దేశ ప్రధాని టోనీ అబాట్తో కలిసి ఫొటో తీసుకుని దాన్ని ట్వీట్ చేశారు మోదీ.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  twitter followers  crosses  8 million  American President  barrack obama  pope Francis  

Other Articles