కేంద్రీయ విద్యాలయాల్లో తృతీయ భాషగా ఈ విద్యాసంవత్సారానికి జర్మన్ భాష కొనసాగనుంది. దేశ సర్వోన్నత న్యాయాస్థానం సూచనతో ఈ విద్యా సంవత్సరానికి గాను కేంద్రీయ విద్యాలయాల్లో జర్మనీ భాషను తృతీయ భాషగా కేంద్ర కోనసాగించనుంది. ఈ విషయాన్ని కేంద్రం పరిశీలన చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. జర్మనీ బాషను కొనసాగించడంలో ఎలాంటి అభ్యంతరాలు వున్నా వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీఎస్) మూడో భాషగా సంస్కృతాన్ని తప్పనిసరిచేస్తూ మానవ వనరుల శాఖ జారీచేసిన ఆదేశాలపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాసంవత్సరం రమారమి పూర్తి కావస్తున్న సమయంలో తృతీయ భాషగా సంస్కృతాన్ని కొనసాగించాలన్న కేంద్రం అదేశాలపై విద్యార్థుల తల్లిదండ్రులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు విచారణను చేపట్టిన సుప్రీంకోర్టు మూడో ప్రాధాన్య భాషగా జర్మనీని ఈ ఏడాదికి కొనసాగించాలని సూచించింది. కేసు విచారణలో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించి అటార్నీ జనరల్, గత ప్రభుత్వం చేసుకున్న అవగాహన ఒప్పందం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఇకపై ఆ ఒప్పందాన్ని కొనసాగించలేమని న్యాయస్థానానికి తెలిపారు. అయితే ప్రభుత్వం చేస్తున్న తప్పులకు విద్యార్థులను ఎందుకు బలి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఈ సందర్భంగా అటార్నీ జనరల్ ను ప్రశ్నించింది. జర్మన్ స్థానంలో సంస్కృతాన్ని ప్రవేశపెట్టడాన్ని వచ్చే విద్యా సంవత్సరానికి వాయిదా వేయడంపై వివరణ ఇవ్వాలని సూచించింది.
కాగా కేంద్రీయ విద్యాలయాలలో గత కొన్నేళ్లుగా జర్మని భాషను ఒక సబ్జెక్టుగా బోధిస్తున్నారు. అందుకుగాను జర్మనికి చెందిన ఒక సంస్థతో ఆనాటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే జర్మన్ భాషను తొలగించి, సంస్కృతాన్ని పెట్టాలని కేంద్రీయ విద్యాలయాలకు ఆదేశం ఇచ్చింది. విద్యా సంవత్సరం మధ్యలో ప్రభుత్వం ఆదేశాలతో జర్మన్ భాష అభ్యసించే విద్యార్థులకు షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో బాధితు విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టుకు వెళ్లారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more