Calcutta high court grants conditional permission for bjp rally

BJP rally, amit shah, mamata banerjee, high court, west bengal, coditional permission

calcutta high court grants conditional permission for bjp rally

మమత కోటలో కమల వికాసం.. ర్యాలికి కోర్టు అనుమతి..

Posted: 11/29/2014 01:00 AM IST
Calcutta high court grants conditional permission for bjp rally

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో బీజేపీ తలపెట్టనున్న ర్యాలీని అడ్డుకోవాలని చూసిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయత్నాలకు చెక్ పడింది. ఆదివారం కోల్ కతాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేపట్టే ర్యాలీకి షరతులతో కూడిన అనుమతులను కోల్ కతా హైకోర్టు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బీజేపీ ర్యాలీతో శాంతి భద్రత సమస్యలు తలెత్తడంతో పాటు, ట్రాఫిక్ సమస్యలకు కూడా చోటు చేసుకునే అవకాశం ఉందంటూ మమతా బెనర్జీ ప్రభుత్వ అనుమతిని నిరాకరించింది. ఈ మేరకు న్యాయస్థానంలో కూడా పిటీషన్ ను దాఖలు చేసింది.
 
ఈ పదిరోజుల్లో కోల్ కతాలో ర్యాలీకి తమకు అనుమతులు ఇవ్వాలంటూ బీజేపీ మూడు సార్లు హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు షరతులతో కూడా అనుమతులిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బీజేపీ ర్యాలీ పర్యవేక్షణకు ముగ్గురు సభ్యుల కమిటీని హైకోర్టు నియమించింది. ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కాకుండా చూసుకోవాలని న్యాయాస్థానం బీజేపి శ్రేణులను అదేశించింది. దీంతో తృణమూల్ కాంగ్రెస్ పై నైతిక విజయం సాధించామని బీజేపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మమతా బెనర్జీ అప్పీల్ చేయనుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP rally  amit shah  mamata banerjee  high court  west bengal  coditional permission  

Other Articles