Mona lisa actually a portrait of da vinci s mother

mona lisa painting, mona lisa painting history, mona lisa painting latest news updates, mona lisa painting secret china relations, Leonardo da Vinci paints, Leonardo da Vinci mona lisa painting news updates, world historical incidents, latest news updates

Mona Lisa actually a portrait of Da Vinci's mother : Italian historian and novelist Angelo Paratico says Mona Lisa actually a portrait of Da Vinci's mother and da vinci mother is a china slave

‘‘మోనాలిసా’’ పెయింట్ అసలుగుట్టు బయటపడింది

Posted: 12/01/2014 03:18 PM IST
Mona lisa actually a portrait of da vinci s mother

ప్రపంచంలో ఎన్ని పెయింటింగ్ లు వచ్చినా ఎప్పటికీ ప్రత్యేకంగా ఉండే పెయింటింగ్ మొనాలిసా. లియోనార్డో డావిన్సి గీసిన ఈ పెయింటింగ్ ఓ అద్భుత కళాఖండం. ఎంతోమంది ప్రముఖులు ఈ పెయింటింగ్ నకలు ఫొటోలను తమ ఇళ్లలో పెట్టుకున్నారు. ఇంత చరిత్రగల ఈ కళాఖండం వెనక చాలా అనుమానాలు, కథనాలు ఉన్నాయి. ఈ ఫొటో ఒకప్పటి ఫ్రెంచి రాజు భార్యకు చెందినది అని కొందరు అంటే కాదు.., కేవలం డావిన్సి మదికి తోచిన ఓ ఊహాచిత్రం అని మరికొందరు అన్నారు. కాని తాజాగా ఓ కొత్త అంశం తెరపైకి వచ్చింది. మోనా లీసాగా భావిస్తున్న ఫోటో డావిన్సి తల్లిది అని ఇటాలియన్ చరిత్రకారుడు చెప్తున్నాడు.

అంగెలో పరాటికో అనే చరిత్రకారుడు, చైనాతో ప్రాచ్య దేశాలకు సంబంధాలపై ఇరవై సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్నాడు. ఈ పరిశోధనలో ప్రముఖ చిత్ర కారుడు లియోడార్డో డావిన్సి చైనాకు చెందిన వ్యక్తిగా గుర్తించాడట. డావిన్సి తల్లి క్యాటెరినా చైనా బానిస వర్గంకు చెందినట్లు చెప్తున్నాడు. గతంలో ఇటలీ, స్పెయిన్ దేశాలు దాదాపుగా బానిసలతో నిండిపోయినట్లు తేల్చిన కొన్ని పరిశోధనలే ఇందుకు ఆధారమన్నారు. ఇక డావిన్సి గురించి చెప్తూ బహుశా ఆయన శాఖాహారుడని, ఎడమచేత్తో వ్రాసే అలవాటు ఉందని చెప్పాడు. సిగ్మండ్ ఫ్రూయిడ్ చెప్పినట్లు మోనాలిసాగా భావిస్తున్న పెయింటింగ్ డావిన్సి తల్లిది అని స్పష్టం చేస్తున్నాడు.

పెయింటింగ్ లో మోనాలిసా చిత్రం వెనక చైనా భూభాగంలో ఉండే చిత్రాలు కన్పిస్తున్నాయని చెప్పారు. తన వాదనకు బలం చేకూర్చేందుకు అవసరమైతే డావిన్సి బంధువులు, వంశస్థులకు డీఎన్ఏ పరిక్షలు చేస్తే వారి మూలాలు చైనాలో ఉన్నాయో లేవో తెలుస్తుందన్నారు. ఇది తేలితే మోనాలిసా పెయింటింగ్ విషయంలో మరింత స్పష్టత వస్తుందని పరాటికో తెలిపాడు. డావిన్సి గీసిన ఈ చిత్రం మోనాలిసాది కాదు అని  చాలా వాదనలు విన్పించాయి కాని ఇలా చిత్రకారుడి తల్లి ఫోటో అని పరాటికో కొత్త వాదన తెరపైకి తీసుకురావటం విశేషం. ఈ వ్యవహారంపై మరింత లోతైన పరిశోధనలు చేస్తే మిగతా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Leonardo da Vinci  mona lisa  painting  china  slave  latest news  

Other Articles