Cbi put a charge sheet on madhu koda

madhu koda, jharkhand cm, jharkhand news, coal scam, jharkhand coal scam, madhu koda coal scam in jharkhand, jahrkhand cbi case, cbi cases, jharkhand government

cbi put a charge sheet on ex cm madhu koda. court postponed to december 22nd

కోడా పై కొరడా ఝులిపించిన సి.బి.ఐ

Posted: 12/12/2014 01:55 PM IST
Cbi put a charge sheet on madhu koda

ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా పై సి.బి.ఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. బొగ్గు గనుల కేటాయింపులలో కుంభకోణం జరిగినట్లు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం విదితమే. గనుల కేటాయింపుల్లో మోసం కుట్రలకు పాల్పడ్డారంటూ మధుకోడా పై  సి.బి.ఐ అభియోగాలను నమోదు చేసింది. ఈయనతో పాటు ఝార్ఖండ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ బసు తో కలిపి మొత్తం ఆరుగురిపై సి.బి.ఐ అభియోగాలను నమోదు చేసింది. న్యాయస్థానం ఈ కేసు విచారణను డిసెంబర్ 22 కు వాయిదా వేస్తునట్లు పేర్కొంది.

మధుకోడా ఎప్పటి నుండో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయం లోనే భారి మొత్తంలో అక్రమార్జనకు పాల్పడినట్లు, బొగ్గు గనుల కేటాయింపుల్లో చాల పెద్ద మొత్తాలు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపించాయి. అప్పుడు పలు అవినీతి వ్యతిరేక సంఘాలు దీనిపై పెద్ద దూమారం చేశాయి. సి.బి.ఐతో విచారణ చేపించాలని డిమాండ్ చేస్తూ వచ్చాయి. ఆ నేపథ్యంలో కొన్ని రోజుల తర్వాత కోడా ఆస్తులపై సి.బి.ఐ విచారణ చేపట్టింది. విచారణ చేస్తున్నపుడే మధు కోడాకు సంబంధించిన ఎంతో విలువైన ఆస్తులను.., సుమారు 144 కోట్ల ఆస్తులను మనీల్యాండరింగ్ కోర్ట్ పోయిన సంవత్సరం సెప్టెంబర్ నెలలో జప్తు చేసింది. అప్పటి నుండి సి.బి.ఐ తన విచారణను వేగవంతం చేస్తూ వస్తున్నది.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jharkhand  madhu koda  cbi  charge sheet  special court  

Other Articles