Kodandaram on telangana state development

Kodandaram, Tjac Kodandaram, Kodandaram on KCR, Kodandaram on Telangana Government, Kodandaram on Hyderabad, Kodandaram comments, Kodandaram latest, KCR on Telangana development, KCR on Hyderabad, KCR Hyderabad development plan, Kodandaram Hyderabad Vision, KCR Telangana Vision, Telangala latest

Kodandaram on Telangana State Development : Telanagana Political JAC Chairman Kodandaram critises kcr hyderabad development plan asks first give minimum needs to public than thing about luxury. People not thinking about film city, vinayak sagar and other luxury develpment they need minimum helping hand for their growth says Kodandaram

సార్ చెప్పేది కరెక్టే !

Posted: 01/12/2015 08:01 AM IST
Kodandaram on telangana state development

తెలంగాణ వచ్చినప్పటి నుంచి ప్రభుత్వానికి రెబల్ గా మారిన తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం మరోసారి సర్కారుపై విమర్శలు చేశారు. హైదరాబాద్ ను వరల్డ్ సిటీ, తెలంగాణను దేశానికే తలమానికం చేస్తానని సీఎం నిత్యం చెప్తున్న మాటలకు కౌంటర్ ఇచ్చారు. ఖరీదైన కట్టడాల కంటే ముందు ప్రజలకు కనీస అవసరాలు తీర్చాలని హితవు పలికారు. తెలంగాణ విద్యావంతుల వేదిక ఐదవ వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రొఫెసర్ పాల్గొన్నారు.

అభివృద్ది అంటే ఫిలింసిటీ, ఫార్మాసిటీ నిర్మాణాలు, ఎత్తైన భవనాలు, కొత్తగా వినాయక్ సాగర్ నిర్మించటం కాదన్నారు. ప్రజలకు అవసరమైన సంక్షేమ ఫలాలు వారికి అందినప్పుడే అభివృద్ధి అనే మాటకు సరైన అర్థమన్నారు. తన దృష్టిలో ఇంకా సంపూర్ణ తెలంగాణ సాకారం కాలేదన్నారు. అందరి అవసరాలు తీరి అభివృద్ధికి బాటలు పడినపుడే సంపూర్ణ రాష్ర్టం ఏర్పడినట్లు భావించాలన్నారు. ప్రొఫెసర్ చెప్పింది నిజమే, 80శాతం ప్రజలను పట్టించుకోకుండా 20శాతం ప్రజల అభివృద్ధిని పరిగణలోకి తీసుకోలేము. కానీ కేసీఆర్ మైండ్ లో దీనికి ఏం మాస్టర్ ప్లాన్ ఉందో ఎవరు ఊహించగలరు !.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kodandaram  KCR  Telangana development  

Other Articles