America warns pakistan on attacks in india during obama tour

Obama India tour, Obama India tour Arrangements, Obama India tour Security, Obama India tour Delhi security, Obama India tour schedule, USA on Pakistan, US Warns Pakistan, Indian Republic Day, Republic Day 2015 Celebrations, Modi on Obama, India US relations

America Warns Pakistan on attacks in India during Obama Tour : USA Security Officials warns Pakistan to stop or control attacks in India during Obama tour. If any attack made from Pakistan on Obama tour, they will receive seviour punishment says US Officials

భయపెడుతుందా....? భయపడుతుందా...?

Posted: 01/19/2015 09:04 AM IST
America warns pakistan on attacks in india during obama tour

ఏ విషయంలో అయినా అమెరికా రూటే సపరేటు. లోపల టన్నుల కొద్ది భయం ఉన్నా.., బయటకు మాత్రం సీరియస్ ఫేస్ తో ఎదుటి వారికి వార్నింగ్ ఇచ్చే సత్తా ఆ దేశానికే ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్ కు వస్తున్న విషయం తెలిసిందే. రిపబ్లిక్ డే వేడుకల ముఖ్య అతిధిగా వస్తున్న ఒబామా కోసం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. వేల సంఖ్యలో పోలిసుల బందోబస్తు, ముమ్మర తనిఖీలు, సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఒకవైపు భారత్ ఇలా శ్రమిస్తుండగా.., తమ దేశాధినేత పర్యటన నేపథ్యంలో అమెరికా భద్రతాధికారులు కూడా భారత్ కు వచ్చి ఢిల్లీలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

ఒబామా పర్యటించే ప్రాంతాలు, స్థానికంగా ఏర్పాటు చేస్తున్న భద్రత ఇతర అంశాలను దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇదే సమయంలో భారత్ లో దాడులు చేసేందుకు ఉవ్విళ్ళూరే పాకిస్థాన్ కు హెచ్చరికలు చేస్తున్నారు. ఒబామా పర్యటన సమయంలో భారత్ పై దాడులు చేస్తే సహించమన్నారు. ఒకవేళ దాడులు జరిగినా అవి పాక్ నుంచి వచ్చినట్లు తెలిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఈ స్థాయిలో భద్రతను ఏర్పాటు చేస్తున్నా ప్రత్యర్ధి దాడి చేస్తారని అమెరికా ఊహిస్తుండటంతో వారిలో భయం ఉన్నట్లు స్పష్టం అవుతుంది. ఇదే సమయంలో దాడి జరిగితే తామేంటో నిరూపిస్తామని చెప్పటంతో వారి సైనిక సత్తాను చాటుతున్నారు.

ఒబామా పర్యటనకు భారత్ గతంలో ఎప్పుడూ చేయని ఏర్పాట్లు చేస్తోంది. వేడుకలు జరిగే రాజ్ పధ్ లో అసాధారణ భద్రతా చర్యలు చేపట్టారు. రాజ్ పథ్ మార్గంలో 80వేల మంది పోలిసులతో బందోబస్తు కల్పిస్తున్నారు. వీరికి తోడు 10వేల మంది పారామిలటరీ బలగాలు పహారాగా ఉంటాయి. ప్రసంగ వేదికపై ఎన్ క్లోజర్ చుట్టూ ఏడంచెల భద్రతను కల్పిస్తున్నారు. అంతేకాకుండా ఆకాశ మార్గంలో దాడులు జరగకుండా రాడార్ లతో పర్యవేక్షిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Obama India tour  Pakistan terrorists  Republic Day 2015 celebrations  

Other Articles