Hyderabad high court orders telangana government trs party ghmc elections date

telangana government, trs party news, kcr news, cm kcr news, hyderabad high court, telangana high court, ghmc elections news, ghmc elections dates, hyderabad greater elections, telangana media

hyderabad high court orders telangana government trs party ghmc elections date : hyderabad high court orders to trs government to fix the ghmc elections in one week.

మరోసారి తెలంగాణ సర్కార్’పై మండిపడ్డ హైకోర్టు

Posted: 02/02/2015 12:47 PM IST
Hyderabad high court orders telangana government trs party ghmc elections date

తెలంగాణ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుతెన్నులు సరిగ్గా లేవని, ఏ విషయంలోనూ క్లారిటీ ఇవ్వడం లేదంటూ గతంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తి చేసిన విషయం తెలిసిందే! అలాగే ‘ఫాస్ట్’ పథకంపై, వాహనాల నెంబరు ప్లేట్లపై తెలంగాణ తీసుకొచ్చిన స్కీములపై కోర్టు సీరియస్’గా రియాక్ట్ అయ్యింది. దాంతో టీడీపీ సర్కార్ కాస్త వెనకడుగు వేస్తూ ఆయా స్కీములను వాపసు తీసుకుంటున్నట్లుగా ఇటీవలే స్పష్టం చేసింది. అయితే.. ఇంతలోనే మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మళ్లీ మండిపడింది.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కావాలనే ప్రభుత్వం జాప్యం చేస్తున్నట్లు భావిస్తున్నట్లుగా కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆగ్రహించిన కోర్టు.. ఎన్నికల జాప్యం తగదని, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించవద్దని తెలంగాణ సర్కార్’కు మొట్టికాయలు వేసింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో వెల్లడిస్తూ.. తేదీలతో సహా కోర్టుకు హాజరుకావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అందుకు కేవలం వారంరోజులు సమయం ఇస్తున్నట్లుగా న్యాయస్థానం గడువు విధించింది. ఈలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.

స్థానిక సంస్థలు ప్రజాస్యామ్యానికి మూలస్థంబాలని వ్యాఖ్యానించిన కోర్టు.. ఎన్నికల వాయిదాలు తగదని తెలిపింది. వారంలోగా ఎన్నికలను ఎప్పడు నిర్వహిస్తారో తేదీలతో సహా వెల్లడించాల్సిందేనంటూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కోర్టు ఆర్డర్ చేసింది. దీంతో.. టీఆర్ఎస్ శ్రేణులు ఆ విషయమై పనులు వేగవంతం చేసినట్లు సమాచారం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hyderabad high court  telangana trs government  ghmc elections  kcr  

Other Articles