Why re all girls who elope 19 asks incredulous court orders probe

bareilly court orders probe on eloped girls age, 148 girls eloped with their paramours are 19, bareilly district court, bareilly district government counsel K M Khan, bareilly government doctors bribed, bribe, probe, bareilly court orders,

In what has miffed a Bareilly court, the age of 149 girls who had allegedly eloped with their paramours in the last six months was shown as 'above 19'.

ఔరా..! ..లేచిపోయిన 148 మంది బాలికలు మేజర్లేనా..?

Posted: 02/05/2015 10:05 AM IST
Why re all girls who elope 19 asks incredulous court orders probe

ఒక్కరు కాదు ఇద్దరు కాదు 149 మంది బాలికలు.. అందరూ మేజర్లే అదేలా అంటూ విస్మయం వ్యక్తిం చేసిన బరేలీ జిల్లా న్యాయస్థానం. 149 మందిలో ఒకే ఒక బాలికకు 24 వుండగా అందరూ 19 ఏళ్లకు పైనే ఎలా వున్నారంటూ నిలదీసింది. సమాధానం దోరక్కపోవడంతో బాలికల వయస్సుపై విచారణ జరిపించాలని అదేశింది.  వివరాల్లోకి వెళ్తే బరేలి జిల్లాలోని బాలికలు వ్యామోహమో, ప్రేమో తెలియని వయస్సులో తమ ప్రియుళ్లతో కలసి పారిపోయి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. గత ఆరు మాసాల్లో 149 మంది బాలికలు పారిపోయి పెళ్లి చేసుకున్నారు.. పరిస్థతి తీవ్రతను అర్థం చేసుకున్న పోలీసులు తల్లిదండ్రుల పిర్యాదుల నేపథ్యంలో వారిని వెతికి పట్టుకుని తిరిగి వారి తల్లిదండ్రులకు అప్పగించారు.

ఇక్కడే అసలు సమస్య వచ్చిపడింది. తాము మేజర్లమని వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించి వాదించడంతో వారి వయస్సును నిర్ధారించేందుకు కోర్టు వారిని బరేలి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. అయితే వారి అసలు వయస్సు కన్నా.. కొంచెం అధికంగా వయస్సును వేయండంటూ బాలికలతో పాటు ఆమె ప్రియుళ్లు డాక్టర్లను వేడుకున్నారు. బాలికలు కూడా ఇందుకు వంతపాడటంతో.. వైద్యులు అడిగినంత మొత్తం లంచాన్ని ప్రియుళ్లు సమర్పించుకున్నారు. ఇకనేం బాలికలందరూ మేజర్లని వైద్యులు దృవీకరించడంతో వారందరూ న్యాయస్థానానికి వచ్చి వారి సర్టిఫికెట్లను సమర్పించారు. దీంతో పారిపోయి పెళ్లి చేసుకున్న బాలికలందరూ 19 ఏళ్ల వారే ఎలా అవుతారంటూ న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.

ఈ విషయమై బరేలి జిల్లా కోర్టు ప్రభుత్వం తరపు న్యాయవాది ఖాన్ మాట్లాడుతూ.. బాలికల వయస్సును నిర్థారించే క్రమాన్ని వివరిస్తూ.. బాలికల ఎములను బట్టి వారి వయస్సును వైద్యులు నిర్థారిస్థారని తెలిపారు. అంతమాత్రన అందరి వయస్సు ఒకేలా వుండటం అసాథ్యమని, అయితే ప్రియుళ్లతో జీవితాన్ని పంచుకునేందుకు ఆయా జంటలు వైద్యులకు లంచాలను ఇచ్చివుంటాయని అనుమానాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో బాలికల వయస్సును నిర్థారిస్తూ పాఠశాలలు జారీ చేసిన సర్టిఫికెట్లు లేదా జన్మ ధ్రృవీకరణ పత్రాలను తీసుకురావాలని వారి తల్లిదండ్రులకు కూడా న్యాయస్థానం అదేశించింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : District government counsel K M Khan  Bareilly court  19 years  

Other Articles