Goswami steps down as home secretary goyal replaces him

Saradha chit fund scam case, Home Secretary Anil Goswami resigned, L.C. Goyal appointed as Home secratary, Appointments Committee of the Cabinet (ACC), Home Minister Rajnath Singh, foreign secretary Sujatha Singh, DRDO chief Avinash Chander, former minister of state Matang Sinh,

The government appointed L.C. Goyal as his replacement a few hours later. Official sources said Goswami handed over his resignation to Home Minister Rajnath Singh.

శారదా ఎంత పని చేశావు: అనీల్ ‘గో’స్వామి

Posted: 02/05/2015 11:12 AM IST
Goswami steps down as home secretary goyal replaces him

శారద చిట్ ఫండ్ స్కామ్ కేసు ఎంత పని చేసిందో తెలుసా..? ఎక్కడో పశ్చిమ బెంగాల్ లో దొరికిన తీగను లాగుతుండగా.. డొంక మాత్రం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కిందే వుందన్న విషయం తాజా విచారణలో బయటపడింది. సుమారు రెండేళ్లుగా ఎందరో ప్రముఖులు చుట్టూ బిగుసుకున్న ఉచ్చు.. చివరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి పదవికే ఎసరు పెట్టింది. కేంద్రం హోం శాఖ అదేశాల మేరకు హోం శాఖ కార్యదర్శి అనీల్ గోస్వామి రాజీనామా చేశారు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలసి ఆయన తన రాజీనామాను సమర్పించారు. ఆయన రాజీనామాను కేంద్ర క్యాబినెట్ నియామకాల సంఘం ఎలాంటి అలస్యం చేయకుండా అమోదించింది.

ఈ నేపథ్యంలో కొత్త హోం శాఖ కొత్త కార్యదర్శిగా ఎల్.సి.గోయల్ ను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 1979 బ్యాచ్ ఐఎఎస్ కేరళా క్యాడర్ కు చెందిన ఎల్ సి గోయల్ మరో రెండేళ్ల పాటు ఈ పదవిలో కోనసాగనున్నారు. శారదా చిట్ ఫండ్ కుంభకోణానికి సంబందించి కేంద్ర మాజీ మంత్రి మాతంగ్ సింగ్ ను అరెస్టు చేయకుండా కేంద్ర హోం శాఖ కార్యదర్శి హోదాలో అనీల్ గోస్వామి అడ్డుకునేందుకు ప్రయత్నించారని ఆరోపణ రావడంతో ఆయనను తప్పించి గోయల్ ను నియమించారు.

కాగా కేంద్రంలో బీజేపి నేతృత్వంలోని నేషనల్ డెమక్రటిక్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చిన తరువాత కీలక బాధ్యతలలో వున్న మూడో అధికారిపై వేటు పడింది. యూపీఏ హయాం నుంచి విదేశాంగ కార్యదర్శిగా వున్న సుజాత సింగ్ గత వారం కేంద్రం ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఢిఫెన్స్ పరిశోధన అభివృద్ది సంస్థ (డీఆర్డీఓ) చీఫ్ అవినాష్ చందర్ లపై వేటు వేసింది. ప్రధాని నరేంద్ర మోడీ నేపాల్ పర్యటన సమయంలో స్పెషల్ ప్రోటెక్షన్ గ్రూప్ ఛీప్ కె దుర్గా ప్రసాద్ పై కూడా వేటు వేయగా, ప్రస్తుతం ఆయనను సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ విభాగానికి బదిలీ చేశారని సమాచారం.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anil Goswami  L.C Goyal  Matang Sinh  Saradha scam  new home secretary  

Other Articles