Center takes a serious view on gang rape convict interview

center serious on gang rape convict interview, storm over interview of december 16 gangrape convict, december 16 gangrape convict mukesh singh, center serious on the issue, union home minister Rajnath singh, jail officials, bbc news network authorities, nirbhaya case, mukesh singh interview, convict, december 16

storm over interview of december 16 gangrape convict in jail, government takes a serious view on the issue

ముఖేష్ సింగ్ ఇంటర్వ్యూ అంశంపై కేంద్రం సీరియస్..

Posted: 03/03/2015 09:33 PM IST
Center takes a serious view on gang rape convict interview

నిర్భయ గ్యాంగ్ రేప్ కేసు దోషి ముఖేష్ కుమార్ ఇంటర్వ్యూపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సీరీయస్ అయింది.  ఇంటర్య్వూను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఎఫ్ఆర్ఐ నమోదు చేయమని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. . దీనిపై వివరణ ఇవ్వాలని హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీహార్ జైలు డైరెక్టర్ ను ఆదేశించారు. ఇదిలా ఉండగా ముఖేశ్ మాటలు సిగ్గు చేటని, అతన్ని ఉరి తీయాలని నిర్భయ తల్లి దండ్రులు డిమాండ్ చేశారు. కాగా, బీబీసీ కోసం  ముఖేశ్ తో మాట్లాడేందుకు 2013 లో అప్పటి తీహార్ జైలు డైరెక్టర్ విమాలా మెహ్రా నుంచి అనుమతి తీసుకున్నట్లు డాక్యుమెంటరీ నిర్మాత లెస్లీ ఉద్విన్ తెలిపారు.
 
మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా బీబీసి కి  ఇంటర్య్వూఇచ్చాడని చెబుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చేసిన సంగతి తెలిసిందే.  ఆ ఇంటర్వ్యూలో అత్యాచారాలకు అమ్మాయిలదే ప్రధాన బాధ్యత అంటూ  ముఖేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.   దీనిపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి . జైలు శిక్షవేసినా నిర్భయ  దోషి మనస్తత్వంలో మార్పురాలేదనీ...అసలు జైల్లో ఉన్నదోషిని ఇంటర్య్వూ చేయడానికి ఎలా అనుమతిచ్చారంటూ  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  ఈ ఉదంతంపై దేశవ్యాప్తంగా   విమర్శలు వెల్లువెత్తడంతో హోం శాఖ రంగంలోకి దిగక తప్పలేదు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nirbhaya case  mukesh singh interview  convict  december 16  

Other Articles