D k ravikumar allegedly committed suicide by hanging himself

Kolar, Karnataka, D K Ravikuma, suicide, hang, Bengaluru

An Indian Administrative Service (IAS) officer, who took on the sand mafia in Karnataka's Kolar District, was found dead at his residence on Monday. Preliminary investigations suggest that D K Ravikumar allegedly committed suicide by hanging himself at his official residence in Bengaluru's posh Koramangla locality.

ఉరి వేసుకొని ఐఏఎస్ ఆత్మహత్య

Posted: 03/17/2015 09:49 AM IST
D k ravikumar allegedly committed suicide by hanging himself

కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపిన ఐఏఎస్ అధికారి డీకే రవి ఉరేసుకొని మరణించారు. ప్రస్తుతం ఇన్ కం ట్యాక్స్ లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో  అడిషనల్ కమిషనర్‌గా ఆయన పనిచేస్తున్నారు. ఉదయం కార్యాలయం నుంచి ఇంటికి తిరిగి వచ్చి ఉరి వేసుకున్నట్లు సమాచారం.  ప్రాథమికంగా దీన్ని ఆత్మహత్యగానే పరిగణిస్తున్నట్లు పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి తెలిపారు. రవి ఇంట్లో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదన్నారు. కర్ణాటక కేడర్ 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయినా రవి కోలార్ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకొని వార్తల్లో నిలిచారు. గత అక్టోబర్‌లోనే కర్ణాటక ప్రభుత్వం అతన్ని వాణిజ్య పన్నుల శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా బదితీ చేసింది. అయితే డీకే రవి మృతిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. డీకే రవి కు వచ్చిన ఫోన్స్ రికార్డును, అతన్ని కలిసిన వ్యక్తుల జాబితాను సేకరిస్తున్నారు పోలీసులు. సిసిటివి పుటేజ్ లను నిశితంగా పరిశీలిస్తున్నారు నిఘా వర్గాలు. డీకే రవి మృతిపట్ల పలువురు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కర్ణాటక ఎంతో నిజాయితీ అధికారిని కోల్పోయిందని కర్ణాటక హోంమంత్రి జార్జ్ తెలిపారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kolar  Karnataka  D K Ravikuma  suicide  hang  Bengaluru  

Other Articles