Properties of Ramky Pharma attached, Y S Jagan, dis appropriate assets

Properties of ramky pharma attached

Enforcement Directorate (ED, money laundering, disproportionate assets, YSR Congress leader, Y S Jagan Mohan Reddy, Ramky Pharma City India Ltd, ys jagan, it raids, ramky group, ys jagan case, cbi probe, Ramky assets attachment, Y S Jagan, dis appropriate assets

The Enforcement Directorate (ED) has initiated a probe under the Prevention of Money Laundering Act, 2002, against Ramky Pharma City India Ltd (RPCIL) and others and ordered provisional attachment of properties to the tune of Rs 216.18 crore.

రాంకీ ఫార్మపై కూడా ఈడీ రంగు పడింది..!

Posted: 03/28/2015 10:36 AM IST
Properties of ramky pharma attached

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డ అక్రమాస్థుల కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్.. రాంకీ ఫార్మా సిటీ ఇండియా లిమిటెడ్ కు చెందిన ఆస్తులను జప్తుచేసింది. 216.18 కోట్ల రూపాయల రాంకీ ఫార్మా ఆస్తులను ఈడి జప్తు చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రాంకీ గ్రూపు కూడా లభ్దిపోందిందన్న ఆభియోగాలపై దర్యాప్తు జరుపుతున్న ఈడీ ఆస్తులను జప్తు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వైఎస్ హాయంలో రాంకీ గ్రూప్‌కు విశాఖలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మా సిటీలో 914 ఎకరాల భూమిని అక్రమంగా కేటాయించారని అభియోగాలపై ఈడీ దర్యాప్తు జరుపుతోంది.

అంతేకాకుండా ఈ భూముల కేటాయింపుల కోసం రోడ్లకు ఇరువైపునా వున్న గ్రీన్ బెల్ట్ ఏరియాను 250 మీటర్ల నుంచి 50 మీటర్లకు కుదిస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ అభియోగాలపై దర్యాప్తు జరిపిన ఎన్పోర్స్ మెంట్ ఢైరెక్టరేట్.. రాంకీ సంస్థకు లభ్ది పొందడం ద్వారా పది కోట్ల రూపాయలను జగన్ పబ్లకేషన్స్ సంస్థలో పెట్టుబడులుగా పెట్టినట్లు తేల్చింది. కాగా ఫార్మ సిటీలోని 914 ఏకరాలలోని భూమిలో 627 ఏకరాల భూమిని ప్లాట్లుగా విభజించి పలు ఫార్మా కంపెనీలకు విక్రయించగా, మిగిలిన భూమిని ఇతర సంస్థలకు లీజు రూపంలో కట్టబెట్టిందని ఈడీ తెలిపింది.

దాని ఆధారంగానే ఇప్పుడు మనీ ల్యాండరింగ్‌ కేసును ఈడి అధికారులు నమోదు చేసి, ఆస్తులను జప్తు చేశారు. గతంలో కూడా వైయస్ జగన్ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) రాంకీ గ్రూప్‌నకు చెందిన 143.74 కోట్ల రూపాయల స్థిర, చరాస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసిందే. వీటిలో రాంకీ ఫార్మా సిటీకి సంబంధించిన 135.46 కోట్ల రూపాయల స్థలంతోపాటు మ్యూచువల్ ఫండ్స్ లోని 3.20 కోట్ల రూపాయల డిపాజిట్లు, జగతి పబ్లికేషన్స్‌లోని 10 కోట్ల రూపాయల ఇన్వె స్ట్‌మెంట్‌ను ఇడి జప్తు చేసింది


జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ramly Pharma  Enforcement Directorate  Y S Jagan  disappropriate assets  

Other Articles