‘మా’ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మార్చి 29 (ఆదివారం)న ప్రశాంతంగా ముగిసిన విషయం తెలిసిందే! ఈ ఎన్నికల్లో భాగంగా మొత్తం ఓట్లు 702 కాగా.. కేవలం 394 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో అధ్యక్ష పదవికోసం రాజేంద్రప్రసాద్, జయసుధ బరిలో నిలిచిన విషయం విధితమే! ఈ ఎన్నికలు ముగిసిన అనంతరం వీరిద్దరి భవితవ్యం రెండుమూడు రోజుల్లోనే తేలనుందని అంతా అనుకున్నారు. ఇండస్ట్రీలోనే సరికొత్త నాంది పలికిన ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారోనని టాలీవుడ్ ప్రేక్షకులతోపాటు సినీ ప్రముఖులు సైతం ఎంతో ఆసక్తిగా వున్నారు. అయితే.. సిటీ సివిల్ కోర్టు ఈ ఎలెక్షన్ ఫలితాలపై అందరికీ షాక్ తగిలేలా తాజాగా తీర్పును వెల్లడించింది.
‘మా’ ఎన్నికలు జరగడానికి ముందు ఈ ఎలెక్షన్స్ లో అవకతవకలు జరుగుతున్నాయని నటుడు ఓ.కల్యాణ్ సిటీ సివిల్ కోర్టులో పిటీషన్ వేసిన విషయం తెలిసిందే! దీంతో ఈ ఎన్నికల ఫలితాలు కోర్టు తీర్పు అనంతరమే తేలాల్సి వుండేది. ఎన్నికలు ఏ విధంగా జరగాయోనన్న విషయంపై సమగ్ర విచారణ జరిపిన మేరకే తీర్పు వెల్లడించాలన్న సూచనను కోర్టు ఇచ్చింది. ఆ మేరకే ఎన్నికల పోలింగ్ వీడియో క్యాసెట్లను పోలింగ్ అధికారులు కోర్టుకు సమర్పించాలి. కానీ.. అధికారులు ఇంతవరకు ఆ వీడియో క్యాసెట్లను సమర్పించకపోవడంతో ‘మా’ ఎన్నికల ఫలితాలపై విచారణను కోర్టు ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.
నిజానికి మంగళవారమే (31-03-2015) ‘మా’ ఎన్నికల ఫలితాలను కోర్టు ప్రకటించే అవకాశం ఉందని ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు మురళీమోహన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం జరిగిన పోలింగ్‌కు సంబంధించి క్యాసెట్లను అధికారులు కోర్టుకు సకాలంలో సమర్పించలేకపోయారు. దీంతో మరో వారంవరకు ఈ ఎన్నికల్లో ఎవరు గెలుపొందాన్న విషయం సస్పెన్స్ గానే కొనసాగనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more