భారతీయ సమాజంలో ఆడవాళ్లను చులకనగా చూడడం, వారిపై జరుగుతున్న అత్యాచారాలకు వారే బాధ్యులంటూ నిందలు వేయడం, వారి అందచందాల గురించి, వారు చేసే నృత్యాల గురించి అసంబద్ధంగా మాట్లాడటం మన ఎంపీలకు, రాజకీయ నేతలకు పరిపాటిగా మారుతోంది. ఆకాశంలో సగం అంటూ నిన్నదిస్తూ.. అన్ని రంగాలలో దూసుకుపోతున్న మహిళలను.. మానసికంగా కృంగదీసి.. తమ అధిపత్యాన్ని చాటుకునే చర్యలకు పురుష సమాజం బాటలు వేసుకుంటోంది. పార్టీలతో ప్రమేయం లేకుండా ఏ పార్టీవారైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, తమ వ్యాఖ్యలపై వివాదం చెలరేగగానే తమ ఉద్దేశం అది కాదంటూ నాలిక్కరుచుకోవడమూ కూడా పరిపాటిగానే మారిపోతున్నది.
అనాదిగా ఆడవాళ్లను ఇళ్లకు పరిమితం చేసి.. వారిలోని నైపుణ్యాలను తోక్కిపెట్టిన సమాజం కట్టబాట్లను చీల్చుకుంటూ.. ముందుకు సాగుతున్న మగువలను గౌరవించాల్సింది పోయి వారినే టార్గెట్ గా చేసుకుని వ్యంగాస్త్రాలు సందించడం, వారి చులకన చేసి మాట్లాడటం నేతలకు తగునా.. ? వారి విజ్ఞతకే వదిలేయాల్సి వస్తుంది. అయితే చిన్న, చితకా నేతలే కాదు కేంద్ర మంత్రి పదవులను అలంకరించిన నేతలు కూడా ఈ తరహా వ్యాఖ్యాలు చేస్తుంటే.. ఇక నిలువరించే వారెవరూ..? ఆడవారికి మేలు చేసే నేతలు ఎవరు..?
అధికారంలోని బీజేపికి చెందిన కేంద్ర మంత్రి తాజాగా చేసిన వ్యాఖ్యలతో పాటు గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ చేసిన వ్యాఖ్యాలు తాజాగా సంచలనం రేకిత్తిస్తున్నాయి. అన్నిరంగాలలో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ఇముడ్చుకుని ముందుకు వెళ్లాలని అధికార పార్టీ నేతలు అడుగులు వేస్తున్న తరుణంలో.. భారతీయ సమాజంలో ఆడవారిని దేవతలుగా కోలిచే సంస్కృతి వుందన్న విషయాన్ని మర్చిపోయి వ్యాఖ్యలు చేస్తున్నారు.
భారతీయ చరిత్రలో ఒక జాతీయ పార్టీకి ఏకంగా పదిహేడేళ్ల కాలంపాటు అధ్యక్షురాలిగా కొనసాగుతున్న పార్టీ అధినేత్రినే టార్గెట్ చేస్తూ.. సభ్య సమాజం తలదించుకునేలా వ్యాఖ్యాలు చేసిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఎట్టకేలకు తన వ్యాఖ్యాలను ఉపసంహరించుకున్నారు. వర్ణ వివక్షకు తెరలేపుతూ..కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెల్లటి శరీర వర్ణంతో వున్నందువల్లే కాంగ్రెస్ పార్టీ అద్యక్షురాలు అయిందని..మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ నైజిరీయా దేశస్తురాలిని వివాహం చేసుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని వ్యాఖ్యానించారు.
తన వ్యాఖ్యాలపై వెనక్కు తగ్గి క్షమాపణలు చెప్పిన కేంద్రమంత్రి తన వాదనను బలపర్చకుంటూనే.. తన వ్యాఖ్యలు అఫ్ ది రికార్డ్ అని, వాటిపై కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ఇబ్బందుల పాటు చేస్తున్నారని ఎదురు పశ్నించడం అయన అసలు నైజాన్ని బయటపెడుతోంది. ఇక కాంగ్రెస్ అసలైన ప్రత్యామ్నాయం తామే అంటూ చెప్పుకుని అధికారంలోకి వచ్చిన బీజేపి కూడా.. కేంద్రమంత్రి విచారం వ్యక్తం చేశారు కాబట్టి ఆ వ్యవహారం ముగిసినట్లేనని సమర్ధించడం దేనికి సంకేతమన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
ఇదిలావుండగా, ఎండలో సమ్మె చేస్తే... వేడిమికి కమిలిపోయి నల్లగా మారుతారని.. అలా చేస్తే.. వారికి మంచి వర్ణంతో వున్న పెళ్లికొడుకు దొరకడం కష్టం... అంటూ బీజేపి అధికారిక రాష్ట్రం గోవా సిఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ వ్యాఖ్యలు తీవ్ర కలకలాన్ని రేపాయి. లక్ష్మీకాంత్ పర్సేకర్ కూడా పరోక్షంగా వర్ణానికి సంబంధించిన అంశాన్నే తెరపైకి తీసుకురావడం.. కలకలం రేపింది. తమ డిమాండ్లను పరిష్కరించాలని గోవా నర్సులు చేస్తున్న డిమాండ్ లపై సిఎం లక్ష్మీకాంత్ పర్సేకర్.. బాధ్యతాయుతమైన పదవిలో కోనసాగుతూ.. అదీ ముఖ్యమంత్రిగా వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు జరపాల్సిందిపోయి.. నర్సుల వర్ణ వివక్షలపై వ్యాఖ్యలు చేయడంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.
యత్ర నార్యంతు ప్యూజంతే.. తత్ర రమ్యతే దేవతాం అంటూ స్త్రీలను ఆరాధించే భారతీయ సమాజంలో.. పురుషాధిపత్యం పెచ్చుమీరుతోంది. హద్దులు దాటి అవహేళన చేస్తోంది. అడది అబల కాదు సబల అంటూ ఓ వైపు మహిళలు అన్ని రంగాలలో అధిపత్యాన్ని చాటుకుంటున్నా.. వారి పట్ల ఎంతటి వ్యంగ భావనలు, అర్థరహిత ఆలోచనలు వున్నాయో అర్థమవుతోంది. ఆకాశంలో విహాంగాలనే కాదు, పరిశ్రమలలో ప్రగతి చక్రాలను, రోడ్డలపై ఆటో చక్రాలు, టాక్సీ చక్రాలను కూడా నడుతపుతూ.. గ్రామీణ ప్రాంతంలోని కూలి పనులు, పోలం పనుల దగ్గర్నించి.. ఐటీ ఇండస్ట్రీలు, రియల్ ఎస్టేట్ రంగాలు.. చివరకు పురుష పుంగములు అసహించుకునే పనులు పిల్లల్ని పెంచడం లాంటి వాటిని కూడా ధైర్యంగా చేస్తారు.
అటు రాజకీయాలలోనూ మహిళామణులు వారి సత్తాను ఎప్పటిఅప్పుడు రుజువు చేసుకుంటూనే వున్నారు. రాజకీయాలలోనూ అనాటి ఇందిరాగాందీ నుంచి ఇవాళ్టి సోనియాగాంధీ వరకు. పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ, తమిళనాట జయలలిత, ఉత్తర్ ప్రదేశ్ మాయవతి ఇక భవిషత్తులో మరెందురు మహిళా రాజకీయ వేత్తలో భారత భూభాగంలో తమ అధిపత్యాన్ని రుజువు చేసుకుంటున్నా.. ఎందుకీ వివక్ష. అధికార బీజేపిలోని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ ను కూడా అమ్మలా ఆరాధిస్తారు. జయలలితను అమ్మ అంటూ పిలుస్తుంటారు. అయినా ఆడవారిపై ఎందుకు ఈ ఎనలేని వివక్ష. ఎందుకీ చులకన భావం..
అటు క్రీడారంగంలో పీటీ ఉష, కరణం మల్లేశ్వరి నుంచి సానిమా మిర్జా, సైనా నెహ్వాల్ వరకు అందులేరు, ఇందు గలరు.. అంతెందుకు ఎందెందు వెతికినా మహిళా మణులు గలరే అన్నట్లు ఏ రంగాన్ని తీసుకున్నా మహిళా మణులు కబడతారు. పురుషులతో పోటీగా.. కాదు పురుషులకన్నా మించి ముందుకు సాగుతున్నారు. అన్ని రంగాలలో నిష్ణాతులైన మహిళలను ప్రోత్సహించి ముందుకు నడపాల్సిన బాధ్యత మగవారిపై లేదా..? క్షణం ఆలోచించండీ.. అమ్మగా, సోదరిగా, అర్థాంగిగా అవతరించిన పురుషులకు సేవలు చేస్తున్నా.. వారిని ప్రోత్సహించడంలో ఎందుకీ అభ్యంతరాలు. వారికి ప్రోత్సహించకున్నా పర్వాలేదు కానీ.. వారి హృదయాలు గాయపడేలా పురుషాదిక్య సమాజం వ్యాఖ్యానించడమే వారిని మరింత బాధపెడుతోంది.
ఇది కేవలం ఒక్క రోజు కాదు అన్న వ్యాఖ్యలు కాదు.. నిరంతరం రావణకాష్టంగా పురుషాదిక్య సమాజంలో ఆడవారి హృదయాలు అగ్నికిలల మాదిరిగా నిత్యం కాలుతూనే వున్నాయి. అనాధిగా కోనసాగుతున్న ఈ ఆదిపత్యం ఇంకెన్నాళ్లు.. మరెన్నేళ్లు.. మీరే అలోచించండి. ఒక క్షణం మన ఇంటి ఆడపడచులే ఇలాంటి అవమానాలు వినాల్సి వస్తే.. వాటిని మనం ఎలా ఎదుర్కోంటామో.. వారినెలా సముదాయిస్తామో అర్థంచుుసుకుని మసలుకోండి.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more