Khemka | Transfor | Haryana

Ashok khemka receive 46th time transfor order from haryana govt

ashok khemka, khemka, Ias, Haryana, Vadra, Bjp, Congress

The change of guard at the Centre and in the state has not changed anything for senior IAS officer Ashok Khemka, who was on Wednesday once again transferred to an inconsequential posting by the BJP government in Haryana.

అశోక్ ఖేమ్కా ఐఏఎస్.. 46వ సారి బదిలీ

Posted: 04/02/2015 11:45 AM IST
Ashok khemka receive 46th time transfor order from haryana govt

నిజాయితీగా పని చేస్తే ఎలాగూ వచ్చే జీతమే వస్తుంది మరీ నిజాయితీ ఎక్కువైతే మాత్రం బదిలీయే . ఇది ప్రభుత్వ శాఖల్లో పని చేసే వారికి లభించే గౌరవం. నిజాయితీగా, నికచ్చిగా వ్యవహరించే అధికారులు వస్తే తమ పప్పులు ఉడకవి గ్రహంచిన అధికారులు, రాజకీయ నేతలు వారి బదిలీ  కోసం పైరవీలు చేస్తారు చివరకు వారిని సాగనంపుతారు. అయితే ఇలా బదిలీ ఆర్డర్ లు ఎన్ని అందుకున్నా వారు మాత్రం తాము నమ్మిన సిద్దాంతాన్ని వదలరు. అలా నిజాయితీగా పని చేస్తున్నందుకు ఇప్పటికి ఓ 45 సార్లు బదిలీ  అయ్యారు ఓ ఐఏఎస్ అధికారి. తమకు ఏ మాత్రం నచ్చక పోయినా వెంటనే ట్రాన్స్ వర్ కాపీని చేతికందిస్తుంటారు పై అధికారులు. అయితే 45 సార్లు బదిలీ అయిన అధికారి 46 వ బదిలీ కాపీని కూడా అందుకున్నారు. బదిలీ ల్లో హాఫ్ సెంచరీకి దగ్గర్లో ఉన్న ఆ ఐఏఎస్ అధికారి ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

అతని పేరు అశోక్ ఖేమ్కా.. అతని హోదా ఐఏఎస్.. నచ్చని పదం అవినీతి. ఏంటీ సినిమాలో డైలాగులు రాస్తున్నారేంటి అనుకుంటున్నారా.. సినిమా కన్నా ఇది నిజ జీవితంలో జరుగుతోంది మరి. అశోక్ ఖేమ్కా హర్యానా రాష్ట్రంలో గత కొంత కాలంగా సేవలు అందిస్తున్నారు. అసలే నిజాయితీగా పని చేసే అధికారులు అంటే పడని మన ప్రభుత్వ శాఖలు అతన్ని మాకు వద్దంటే మాకు వద్దంటూ లేఖలు రాశాయి. దాంతో దాదాపు అన్ని శాఖల్లో కొన్నాళ్లు పని చేస్తూ, అక్కడ అవినీతిని ఏ మాత్రం సహించకుండా, మిగిలిన వారికి నిద్ర లేకుండా చేశారు ఖేమ్కా. దాంతో హర్యానా ప్రభుత్వంలో ఖేమ్కా అంటేనే బదిలీ ఆర్డర్ కాపీ అన్నంతగా ప్రచారం నడిచింది. 24 సంవత్సరాల ఖేమ్కా సర్వీసులో ఇప్పటికి 45 సార్లు బదిలీ అయ్యారంటేనే మన వాడి నిజాయితీ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

రాబర్ట్ వాద్రా అక్రమంగా భూములను సంపాదించారన్న కేసులో ఖేమ్కా రిపోర్ట్ కాంగ్రెస్ కు చెమటలు పట్టించింది. అందుకే ఖేమ్కా బదిలీ కి సిద్దం చేసింది. అయితే ఖేమ్కా రిపోర్ట్ తో ఏకీభవిస్తు కాగ్ నివేదిక హర్యానా ప్రభుత్వం అక్రమంగా, అప్పనంగా భూములను అప్పగించిందని  ఆరోపించింది. దాంతో అశోక్ ఖేమ్కాను ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ కు తర్వాత ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ కు బదిలీ చేసింది. నిజాయితీకి నిలువెత్తు రూపమైన ఖేమ్కా ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ లోనూ అవినీతి భరతం పట్టారు. అక్రమంగా పర్మిట్ లు, వాహనాల ఫిట్ నెస్ సర్టిఫికెట్ ల విషయంలోనూ ఖేమ్కా ఎంతో నిజాయితీగా వ్యవహరించారు.

అయితే ప్రభుత్వ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఖేమ్కాకు అధికారం మారిన ప్రతీ సారి కొత్త తలనొప్పి వచ్చేది. అది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన, బిజెపి అధికారంలోకి వచ్చిన తన బదిలీ మాత్రం పక్కాగా జరిగేది. అయినా ప్రభుత్వాలను పాలించే పార్టీలు మారినా, వాటికి గిట్టని పదం నిజాయితీ అందుకే అన్ని పార్టీలకు, అన్ని ప్రభుత్వాలకు ఖేమ్కా అంటేనే పడదు. మొత్తానికి 46 వసారి బదిలీ చేస్తూ హర్యానా ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చెయ్యడంపై ఖేమ్కా కాస్త నిరాశగా ఉన్నారు. అయినా నిజాయితీగా పని చేసే వారికి ఇవి మామూలే అనుకొని ప్రయాణానికి సిద్దమవుతున్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ashok khemka  khemka  Ias  Haryana  Vadra  Bjp  Congress  

Other Articles