mumbai metropolitan magistrate court warns saif ali khan | taj hotel nri case controversy

Mumbai metropolitan magistrate court final warning saif ali khan in case

saif ali khan, saif ali khan controversy, saif ali khan nri case, saif ali khan marriage, saif ali khan movies, saif ali khan news, saif ali khan updates, saif ali khan mumbai court, mumbai court, magistrate shankar dabhade, mumbai metropolitan magistrate court, mumbai metropolitan court

mumbai metropolitan magistrate court shankar dabhade final warning saif ali khan in case : mumbai metropolitan magistrate court shankar dabhade final warning saif ali khan in attack case on nri in taj hotel.

సైఫ్ అలీఖాన్ కు చివరి వార్నింగ్ ఇచ్చిన కోర్టు..?

Posted: 04/07/2015 12:21 PM IST
Mumbai metropolitan magistrate court final warning saif ali khan in case

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కు ముంబై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఈసారి గట్టి వార్నింగ్ ఇచ్చింది. తదుపరి విచారణకు హాజరు కావాలంటూ చివరి అవకాశమిచ్చిన కోర్టు.. ఈసారి విచారణకు హాజరుకాకుంటే వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది. దీంతో సైఫ్ ఇప్పుడు టెన్షన్ లో మునిగిపోయాడు. ఇంతకీ సైఫ్ కి కోర్టు వార్నింగ్ ఇవ్వడమేంటి..? అతడేం చేశాడనేగా అనుకుంటున్నారు. అయితే అది తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

వివరాల్లోకి వెళితే.. 2012 ఫిబ్రవరి 22వ తేదీన ముంబైలోని తాజ్ హోటల్ లో ఇక్బాల్ మిర్ శర్మా అనే ఎన్ఆర్ఐ వ్యాపారిపై సైఫ్ అలీఖాన్, అతని ఇద్దరు స్నేహితులు కలిసి దాడి చేశాడు. దాంతో ఆ ఎన్ఆర్ఐ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సైఫ్ తోపాటు ఇద్దరు స్నేహితులు కూడా అరెస్టయ్యారు. అయితే కొన్నాళ్లకే వాళ్లు జైలు నుంచి విడుదలయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన కేసులోనే కోర్టులో ఇప్పటివరకు విచారణ జరుగతూనే వుంది. ఈ కేసు విచారణ నేపథ్యంలోనే సోమవారం (06-04-2015) న్యాయస్థానం ముందుకు రావల్సి వున్నప్పటికీ.. సైఫ్ గైర్హాజరయ్యాడు.

తాను షూటింగ్ నిమిత్తం విదేశాల్లో వున్నానని, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ తన తరఫు న్యాయవాది ద్వారా అభ్యర్థన పిటిషన్ దాఖలు చేయించారు. అయితే.. ఈ పిటిషన్ పై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రాసిక్యూటర్ వాజిద్ షేక్.. సైఫ్ పై బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో మేజిస్ట్రేట్ శంకర్ దభడే.. ఈ దాడి కేసులో తదుపరి విచారణకు జూన్ 18వ తేదీన సైఫ్ హాజరు కావాలని తీర్పునిస్తూ తుది అవకాశం ఇచ్చారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : saif ali khan  mumbai metropolitan magistrate court  saif ali khan nri case  

Other Articles