Five alleged SIMI activists shot dead after escape bid in warangal

Vikaruddin and 4 simi terrorists shot dead

encounter in janagam warangal, warangal jail police killed vikaruddin, warangal jail police killed suleman, warangal jail police killed five isi agents in encounter, police comb nalgonda, another suspect moving towards warangal, police searches on for another suspect, nalgonda nazeeruddin baba durga, simi terrorist encounter, simi terrorist shot dead, isi agents shot dead in Telangana

Five alleged SIMI activists were shot dead when they tried to escape while being taken to Hyderabad court from Warangal prison.

కరుడుగట్టిన కర్కోటకులు వికారుద్దీన్.. అండ్ గ్యాంగ్

Posted: 04/07/2015 12:33 PM IST
Vikaruddin and 4 simi terrorists shot dead

వరంగల్ జిల్లా జనగామ వద్ద మరో ఎన్ కౌంటర్ జరిగింది. సిమి ఉగ్రవాదులను పోలీసులు మట్టబెట్టారు. వారిపై వున్న కేసుల విచారణలో భాగంగా నిందితులను వరంగల్ జైలు నుంచి హైదరాబాద్ కోర్టుకు తరలిస్తుండగా, మార్గమధ్యంలో పారిపోయేందుకు యత్నించి, జైలువార్డన్ తుపాకీతోనే కాల్పులు జరిపేందుక యత్నించిన సిమీ ఉగ్రవాదులను పోలీసులు తుదముట్టించారు. ఈ ఘటనలో కరుడుగట్టిన కర్కోటక ఉగ్రవాది.. నాలుగేళ్ల పాటు పోలీసులకు ముచ్చెటమలు పట్టించిన వికారుద్దీన్‌ను ఎట్టకేలకు పోలీసులు మట్ట్టుబెట్టారు. ఖాకీలనే లక్ష్యంగా పెట్టుకుని వారిపై దాడులు చేసిన వికారుద్దీన్‌ను అంతమొందించారు.

జైళ్లలో పోలీసులను, వార్డన్లతో ప్రతినిత్యం ఘర్షణకు దిగేగుతున్న ఈ గ్యాంగ్ ను 2010లో అరెస్టు చేసినప్పటి నుంచి ఇదే పరిస్థతి. దీంతో చంచల్ గూడ జైలుతో విధులు నిర్వహించేందుకు కూడా కానిస్టేబుళ్లు బయపడిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఈ నేపథ్యంలో వికారుద్దీన్ సహా ఇతర సెమీ ఉగ్రవాదులను వేర్వేరు జైళ్లకు తరలించారు. అ సందర్భంలోనే వికారుద్దీన్ ను వరంగల్ జైలుకు తరలించారు. అక్కడ కూడా అతని ప్రవర్తనలో ఏలాంటి మార్పు లేదు. వరంగల్ సెంట్రల్ జైలులో కూడా వికార్ పోలీసులను బెదిరించాడు. తప్పించుకునే ప్రయత్నాలు చేశాడు.

vikaruddin-and-4-SIMI-dead

ప్రతీ సారి కేసు విచారణలో భాగంగా వరంగల్ జైలు నుంచి హైదరాబాద్ కు తరలించే క్రమంలో ఎస్కార్టు వున్నప్పటికీ పోలీసులను వెకిలి చేష్టలతో కవ్వించడం,.. వారిని రెచ్చగోట్టి పారిపోవాలని యత్నించాడు. ఇవాళ కూడా అదే పని చేశాడు. కానీ హతమయ్యాడు. పలుసార్లు పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకోబోయిన వికార్ గ్యాంగ్ ను ఇవాళ పోలీసులు మట్టికరిపించారు.

వికారుద్దీన్ గ్యాంగ్ నేరచరిత్ర ఇది..

* డీజేఎస్ పేరుతో వికారుద్దీన్ హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహించాడు.
* గతంలో సిమిలోనూ క్రియాశీలకంగా పని చేశాడు.
* 2008 సంతోష్‌నగర్ ఐఎస్ సదన్ వద్ద కౌంటర్ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ను హతమార్చాడు.
* 2009 శాలిబండ, ఫలక్‌నూమాలో పోలీసులపై కాల్పులు జరిపి కానిస్టేబుల్, హోంగార్డులను చంపాడు
* 2010లో గుజరాత్ హోం మంత్రి పై దాడి కేసులోను వికార్ నిందితుడు

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : isi agents  vikaruddin  suleman  warangal jail  

Other Articles