Wifi | Free | Hussainsagar | KTR

Telangana govt trying to provide free wifi at hussain sagar and its its premises

Telagnaga, ktr, free wifi, hussain sagar, neckles road, tank band, BSNL, pilot project, lumbini park

telangana govt trying to provide free wifi at hussain sagar and its its premises. The telangana information technology minister ktr commence a review meeting on this issue.

యాహూ.. తొందరలోనే హుస్సేన్ సాగర్ చుట్టూ ఫ్రీ వైఫై

Posted: 04/10/2015 11:03 AM IST
Telangana govt trying to provide free wifi at hussain sagar and its its premises

తెలంగాణలో ఐటి సేవలను విస్తరించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగా పలు చోట్ల ఫ్రీ వైఫై సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందులో బాగంగానే హైదారాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని కొన్ని ప్రాంతాలను ఫ్రీ వైఫై జోన్లుగా మార్చడానికి ఎంపిక చేసుకుంది. అందులో భాగంగానే గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో ఇప్పటికే ఫ్రీ వైఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ వైఫై సేవలను మరింత మందికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

హైదరాబాద్ లో దశల వారీగా ఉచిత వైఫై సేవలను ప్రారంభించేదుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమౌతోంది. త్వరలో హుస్సేన్ సాగర్ చుట్టూ పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన ప్రారంభించబోతున్న ఉచిత వైఫై సేవల పై ఐటీ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ BSNLతో కలిసి క్వాడ్ జెన్ కంపెనీ ఈ సేవలను ప్రయోగాత్మకంగా అందించబోతున్నది. ట్యాంక్ బండ్ , లుంబిని పార్క్, నెక్లెస్ రోడ్డులో సుమారు 1800 నుంచి 2500 మంది ఓకేసారి వైఫైకి లాగిన్ కావచ్చు. త్వరలోనే హుస్సేన్ సాగర్ చుట్టు సూమారు 10 కిలోమీటర్ల పరిధిలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 30 నిమిషాల పాటు ఉచితంగా పైఫై సేవలు పొందవచ్చు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telagnaga  ktr  free wifi  hussain sagar  neckles road  tank band  BSNL  pilot project  lumbini park  

Other Articles