Obama says China bullying smaller nations in South China Sea row

Obama china using muscle dominate south china sea

american president barack obama, U.S. President Barack Obama, Washington is concerned China, sheer size and muscle", smaller nations in the South China Sea, Philippines and Vietnam, U.S. government officials, biejing, china, south china sea, Panama Caribbean summit,

The US is concerned China is using "sheer size and muscle" to strong-arm smaller nations in the row over the South China Sea, Barack Obama says.

దక్షిణ చైనా సమద్రంపై బీజింగ్ అధిపత్యం.. అందోళనకరం

Posted: 04/10/2015 09:32 PM IST
Obama china using muscle dominate south china sea

దక్షిణ చైనా సముద్ర పరిసరాల్లోని చిన్న దేశాలపై..  చైనా బెదిరింపులకు పాల్పడుతోందని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ఒబామా అన్నారు. పనామాలో జరుగుతున్న కరేబియన్ సదస్సులో పాల్గొనేందుకు జమైకా వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. చైనా తన వద్దనున్న అంగ బలంతో పాటు అర్థిక బలంతో చిన్న దేశాలపై పెత్తనం చేయాలని ఆశపడుతుందని ఒబామా అన్నారు. దక్షిణ చైనా సముద్రంలో అధిక భాగాన్ని తనదిగా చైనా క్లెయిమ్ చేస్తోందని అన్నారు. తనదిగా చెప్పుకుంటున్న ప్రాంతం ఫిలిప్పీన్స్, వియత్నాం తదితర దేశాల ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్‌ల పరిధిలోకి చొచ్చుకెళ్తోందని ఆయన మండిపడ్డారు.

ఇది ఇలాగే కోనసాగితే .. భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. చైనా కృత్రిమంగా దీపాన్ని తయారు చేస్తోందని, దాన్ని ఆయుధాగారంగా మార్చుతోందని అన్నారు. అంతర్జాతీయ నిబంధనలను చైనా తుంగలో తొక్కుతోందని ఆరోపించారు. అయితే ఈ సమస్యను ద్వైపాక్షికంగా చర్చలు జరుపుకుని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. కాగా, ఇప్పటికే చైనా దేశ వ్యవహార శైలి పట్ల భారత్ సహా పలుదేశాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : barrack obama  china  dominate  south china sea  

Other Articles