ISIS executes 10 doctors | terrorist organization south of Mosul

Isis executes 10 doctors for refusing to treat its wounded in mosul

isis executes doctors, isis killed 10 doctors, isis murdered doctors, isis iraq fight, ISIS members, Al-Sumaria satellite television network, two women doctors

ISIS executes 10 doctors for refusing to treat its wounded in Mosul : According to source ISIS elements executed ten doctors by firing squad for refusing to treat wounded militants belong to the terrorist organization south of Mosul.

ISIS తీవ్రవాదులు మరో ‘దారుణమైన’ కిరాతకం..

Posted: 04/10/2015 09:35 PM IST
Isis executes 10 doctors for refusing to treat its wounded in mosul

రానురాను ISIS తీవ్రవాదుల దురాగతాలకు అంతులేకుండా పోతోంది. తమకు అడ్డుచెప్పేవాడని లేడన్న అహంకారంతో తమలో దాగివున్న రాక్షసత్వాన్ని సాధారణ ప్రజలపై చూపుతున్నారు. ఇప్పటికే వందలాది ప్రాణాలను బలిగొన్న ఈ తీవ్రవాదుల మరో కిరాతకం తాజాగా వెలుగులోకొచ్చింది. చెప్పిన మాట వినలేదన్న కారణంతో పదిమంది వైద్యులను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేశారు.

ఇరాక్ లోని మొసూల్ నగరంలో ISIS తీవ్రవాదులకు, స్థానిక ప్రభుత్వ గ్రూపులకు మధ్య గత కొన్నేళ్లుగా పోరాటం కొనసాగుతున్న విషయం తెలిసిందే! ఈ క్రమంలోనే ఈ రెండు గ్రూపుల్ మధ్య తాజాగా భీకరమైన పోరాటం జరుగుతోంది. దీంతో మొసూల్ పట్టణం తుపాకీ కాల్పులతో దద్దరిల్లుతోంది. ఇక ఈ పోరాటంలోనే గాయపడిన తమ సహచరులకు చికిత్స చేయాలంటూ ISIS ఉగ్రవాదులు స్థానిక వైద్యులను ఆదేశించారు. అయితే.. సదరు వైద్యులు వారికి వైద్యం చేసేందుకు నిరాకరించారు.

అంతే! ISIS ఉగ్రవాదులు ఆ పదిమంది వైద్యులను ఎడారిలో తీసుకొచ్చి, వారి చేతులు విరిచేసి, మోకాళ్లపై కూర్చోబెట్టి, వారి తలలపై తుపాకులు ఎక్కుపెట్టి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేశారు. ఈ మొత్తం ఘటనను అల్ సుమారియా అనే శాటిలైట్ ఛానెల్ ప్రసారం చేసింది. ఇదేవిధంగా గత అక్టోబర్ లో కూడా ఇద్దరు మహిళా డాక్టర్లు ఈ ISIS ఉగ్రవాదుల చేతుల్లో మొసూల్ లోనే దారుణంగా మరణించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : isis executes doctors  Al-Sumaria satellite television  ISIS militants  

Other Articles