National Investigation Agency | AP | Terrorists

National investigation agency conform that terrorists tour in ap

National Investigation Agency, Terrorists, ap, arvapally, encounter, vikaruddin, sleeper cells, police

National Investigation Agency conform that Terrorists tour in ap. who died in encounter at arvapally terrorists travel to vijayawada, rajamandri, tirupathi ete The National Investigation Agency conformed.

ఏపిలోనే ఉగ్రవాదుల మకాం.. ఎన్ కౌంటర్ కు ముందు ఏం జరిగింది ?

Posted: 04/18/2015 09:16 AM IST
National investigation agency conform that terrorists tour in ap

తెలుగు రాష్ట్రాల్లో సిమి ఉగ్రవాదుల కదలికలపై కలకలం రేగుతోంది. తెలుగురాష్ట్రాల్లో వారు ఎంతో కాలంగా మకాం వేశారని, ముఖ్యంగా ఏపిలో పలు కీలక ప్రాంతాల్లో తిరిగారని సమాచారం ఇప్పుడు అందరిని టెన్షన్ పెడుతోంది. నల్గొండ జిల్లాలో ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఉగ్రవాదులు... మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్న వారని తేలింది. మరి ఈ దాడికి ముందు వారు ఎక్కడ ఉన్నారు? అంటే... ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నారు అని జాతీయ దర్యాప్తు సంస్థ తేల్చింది. ఈ ఇద్దరు ఉగ్రవాదులు  ఆంధ్రప్రదేశ్‌లో కొంతకాలం పాటు మకాం వేసినట్లు నిర్ధారించింది. ‘అర్వపల్లి’ ఎన్‌కౌంటర్‌కు ముందు గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఈ ఇద్దరూ సంచరించినట్లు ఎన్‌ఐఎ నిర్థారించింది. వీరు ఏయే ప్రాంతాల్లో తిరిగారు, ఎవరెవరిని కలిశారు, ఎందుకు కలవాల్సి వచ్చింది, వీరికి షెల్టర్‌ ఇచ్చింది ఎవరు, వీరికి ఎవరైనా కొరియర్లుగా పని చేసే స్లీపర్‌ సెల్స్‌ ఉన్నారా... అనే అంశాలపై ఎన్‌ఐఎ పలు ఆధారాలు సేకరించినట్లు సమాచారం.

ముఖ్యంగా ఆ ఇద్దరు ఉగ్రవాదులు ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించినట్లు కూడా ఎన్‌ఐఏ గుర్తించింది. వీరు స్థానిక జాబ్‌ కన్సల్టెన్సీలను సంప్రదించినట్లు కూడా ఎన్‌ఐఏ విచారణలో తేల్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఐఏ బృందాలు ఏపీలో ఉగ్రవాదులు సంచరించిన ప్రాంతాల్లో దాడులు నిర్వహించినట్లు సమాచారం. దీనిలో భాగంగా ఉగ్రవాదులకు షెల్టర్‌ ఇచ్చిన వారిని, జాబ్‌ కన్సల్టెన్సీ నిర్వాహకులను, ఉద్యోగం కోసం వీరు ఆశ్రయించిన వారిని, పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. గుంటూరు, ఆటోనగర్‌ ప్రాంతాల్లో 9 మందిని, విజయవాడలో ఆరుగురిని, రాజమండ్రిలో ఐదుగురిని, విశాఖ, తిరుపతిలలో మరికొందరిని అదుపులోకి తీసుకొని రహస్య ప్రాంతాలకు తరలించి విచారిస్తున్నట్లు సమాచారం. ఉద్యోగం కోసం ఉగ్రవాదులు ఇచ్చిన బయోడేటాలో వివరాలు, ఇచ్చిన గుర్తింపు కార్డులు, ఏయే పేర్లతో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు... అనే అంశాలను ఎన్‌ఐఏ పరిశీలిస్తోంది. అంతేకాకుండా... ‘మా వారు మరికొందరు ఉద్యోగం కోసం వస్తారు’ అని ఉగ్రవాదులు చెప్పారని కూడా ఎన్‌ఐఏ గుర్తించినట్లు తెలిసింది. దీంతో... ఖాండ్వా జైలు నుంచి వీరితో పాటు తప్పించుకున్న మిగిలిన నలుగురు కూడా తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారా? ఇంత కాలం వీరితోనే కలిసి తిరిగారా? ఉద్యోగాల కోసం వచ్చే మరికొందరిలో వీరు ఉన్నారా?... అనే ప్రశ్నలకు దర్యాప్తు బృందాలు సమాధానాలు రాబట్టే పనిలో ఉన్నాయి. ఈ క్రమంలో ఆయా ఉగ్రవాదులు సంచరించిన ప్రాంతాల్లో వారు సంప్రదించిన వ్యక్తులు, సంస్థల కార్యకలాపాలపై కూడా ఎన్‌ఐఏ పూర్తి దర్యాప్తు చేస్తోంది.

**అభినవచారి**

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : National Investigation Agency  Terrorists  ap  arvapally  encounter  vikaruddin  sleeper cells  police  

Other Articles