Nigerians | Attacked | Police | Hyderabad

Some nigerians attacked on police at hyderabad while checking drunk and drive nigerians tried to attack on police

Nigerians, police, attack, hyderabad, drunk and drive,

some nigerians attacked on police at hyderabad while checking drunk and drive. Nigerians tried to attack on police. Police tried to catch the nigerians who attacked them but they escaped.

ITEMVIDEOS:వాళ్లు పోలీసులపైనే దాడి చేశారు..!

Posted: 04/18/2015 10:27 AM IST
Some nigerians attacked on police at hyderabad while checking drunk and drive nigerians tried to attack on police

మామూలుగా అయితే పోలీసులు లాఠీలు ఝులిపించడం విన్నాం.. పోలీసుల దెబ్బల గురించి మీడియాలో కూడా రకరకాల కథనాలు వస్తుంటాయి. కానీ హైదరాబాద్ లో మాత్రం పోలీసులపైనే దాడి జరిగింది. కానీ చేసింది మాత్రం మన వాళ్లు కాదు నైజీరియన్లు. గత కొంత కాలంగా రెచ్చిపోతున్న నైజీరియన్లు హైదరాబాద్ నగరంలో మళ్లీ రెచ్చిపోయారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్న ఎస్ఐ మీద దాడిచేశారు. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత టోలిచౌకి ఎస్ఐ బాలకిషన్ గౌడ్ బృందం లంగర్హౌస్ బాపూఘాట్ ప్రాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేస్తోంది. అంతలో అటుగా కారులో వచ్చిన ముగ్గురు నైజీరియన్లు ఎస్ఐ మీద దాడికి పాల్పడ్డారు. కారు ఆపమన్నందుకు దాడి చేశారు.

పోలీసులపై దాడికి దిగిన వారిని పట్టకోవడానికి ప్రయత్నించగా నైజీరియన్లు అక్కడి నుండి పారిపోయారు. మరొకరిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ ఇలా పోలీసులపై నైజీరియన్లు దాడిచేసిన సందర్భాలున్నాయి. వీసా గడువు ముగిసినా కూడా అక్రమంగా నివాసం ఉంటున్న నైజీరియన్లు పలు రకాల మోసాలకు కూడా పాల్పడుతున్నారు. గతంలో కొందరిని అదుపులోకి తీసుకున్నా, వాళ్లను శిక్షించడానికి కుదరడంలేదు. వారిని నైజీరియన్ చట్టాల ప్రకారమే విచారించాల్సి రావడంతో పోలీసులు కూడా కఠినంగా వ్యవహరించలేక పోతున్నారు. అయినా మన దేశంలో ఉంటూ నైజీరియా చట్టాల ప్రకారం శిక్ష ఏంటని కూడా కొంత మంది ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా పోలీసుల మీదకే దాడికి ప్రయత్నించడం సిగ్గు చేటు.

**అభినవచారి**

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nigerians  police  attack  hyderabad  drunk and drive  

Other Articles