Gajendra Singh's suicide has nothing to do with Land Acquisition Bill: Venkaiah Naidu

Wont step back in land acquisition bill venkaiah naidu

Venkaiah Naidu, Gajendra Singh, Suicide case, Land Acquisition Bill, Bharatiya Janata Party, Narendra Modi, Aam Aadmi Party, Arvind Kejriwal, Union Parliamentary Affairs Minister M Venkaiah Naidu

Union Parliamentary Affairs Minister M Venkaiah Naidu said on Sunday that there was no link between Gajendra Singh's case, the farmer who allegedly committed suicide at an Aam Aadmi Party (AAP) rally, and the amended Modi government's Land Acquisition Bill.

భూ సేకరణ బిల్లుపై వెనక్కు తగ్గేది లేదు..

Posted: 04/26/2015 09:10 PM IST
Wont step back in land acquisition bill venkaiah naidu

భూ సేకరణ చట్టంపై వెనక్కి తగ్గేదిలేదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. భూ సేకరణ చట్టానికి పార్లమెంట్‌ ఆమోదం కోసం ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజస్థాన్‌ రైతు గజేంద్ర సింగ్‌ మరణానికి, భూ సేకరణ చట్టానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు కావాలనే ఎన్డీయేపై బురద జల్లుతున్నాయని ఆయన విమర్శించారు. నేషనల్‌ క్రైమ్స్‌ బ్యూరో గణాంకాల ప్రకారం గత దశాబ్ద కాలంగా దేశంలో రెండు లక్షల 97వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని వెంకయ్యనాయుడు చెప్పారు.

రైతు ఆత్మహత్యలపై నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని నిందించడం సరికాదని వెంకయ్యనాయుడు హితవు పలికారు. గత రెండు దశాబ్దాలుగా జరుగుతున్న రైతు ఆత్మహత్యలను యూపీఏ సర్కార్‌ ఎందుకు ఆపలేకపోయిందని ఆయన ప్రశ్నించారు. భూసేకరణ చట్టం పార్లమెంట్‌లో ఆమోదం పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నాట్లు ఆయన స్పష్టం చేశారు.
 
జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkaiah Naidu  Gajendra Singh  Land Acquisition Bill  

Other Articles