TRS | Foundation | Hyderabad | Meeting

Trs party gatherring people for partys foundationday meeting

TRS, Foundation day, KCR, Parade ground, Hyderabad

TRS party gatherring people for partys foundationday meeting. Party leaders gatherring nearly ten lakh people for todays meeting.

ఆవిర్భావ సభ అదిరిపోనుంది

Posted: 04/27/2015 08:09 AM IST
Trs party gatherring people for partys foundationday meeting

టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ రాష్ట్రసాధన అనంతరం పార్టీ జరుపుకుంటున్న తొలి ఆవిర్భావ దినోత్సవం కావడంతో భారీగా నిర్వహించేందుకు శ్రేణులు ఉరకలేస్తున్నాయి. చరిత్రలో నిలిచిపోయేలా పది లక్షలమందిని తరలించి సభను సక్సెస్‌చేయాలన్న పార్టీ నిర్ణయం మేరకు వేల వాహనాల్లో ప్రజలు తరలివస్తున్నారు. పార్టీకి అందిన సమాచారం ప్రకారం సభకు వివిధ జిల్లాలనుంచి పదిలక్షలకు పైగా ప్రజలు హాజరుకానున్నారు. ఈ మధ్యాహ్నం ప్రారంభమయ్యే ఈ సభను రాత్రి ఎనిమిది గంటలకల్లా ముగించేలా వివిధ కార్యక్రమాలను రూపొందించారు. ధూంధాం ఆటపాటలతో మొదలయ్యే సభ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ప్రసంగంతో ముగుస్తుంది. సభాస్థలికి తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణంగా నామకరణం చేశారు. పరేడ్ గ్రౌండ్‌లో ఇప్పటికే వేదిక సహా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మైదానంలో బారికేడ్లు, మహిళలకు ప్రత్యేకంగా గ్యాలరీ, చివరి వ్యక్తి వరకు అధినేత ప్రసంగం స్పష్టంగా వినిపించేలా సౌండ్ బాక్సులు, వేదికపై దృశ్యాలు కనిపించేందుకు ఆరు భారీ ఎల్‌సీడీ తెరలు ఏర్పాటు చేశారు.

జిల్లాల నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి అడుగుపెట్టినప్పటి నుంచి సభకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. సభ ప్రాంగణంలోనూ నాలుగు వైపులా తాగునీటితో పాటు వైద్య సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నారు. సభకు నాలుగువేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులే కాకుండా జిల్లాలనుంచి కూడా పోలీసులను రప్పించారు. అలాగే భారీగా తరలివచ్చే వాహనాల కోసం నగరంలో అనేక చోట్ల పార్కింగ్‌సౌకర్యం ఏర్పాటు చేశారు. పరేడ్ గ్రౌండ్ మైదానం చుట్టూ కూడా 33 చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పార్కింగ్ కమిటీ వీటిని పర్యవేక్షిస్తున్నది. పోలీసులు, వలంటీర్లతో వాహనాల పార్కింగ్ ప్రక్రియ సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  Foundation day  KCR  Parade ground  Hyderabad  

Other Articles