Shiavasena | Samna | BJP | landbill | jammu kashmir

Shiva sena attacked on bjp for land bill shivasena mouth peice samna publish a latest article on land bill

Shivasena, Samna, BJP, landbill, jammu kashmir

Shiva sena attacked on BJP for Land bill. Shivasena mouth peice samna publish a latest article on land bill. Shiava sena challenges bjp to implementation of article 370 in jammu kashmir.

బిజెపి పార్టీకి అంత దమ్ముందా: శివసేన

Posted: 04/30/2015 05:09 PM IST
Shiva sena attacked on bjp for land bill shivasena mouth peice samna publish a latest article on land bill

వీలు దొరికితే చాలు  బిజెపిపై కయ్యానికి దువ్వుతోంది శివసేన. మహారాష్ట్రలో రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రెండు పార్టీల నేతల మధ్య దూరం మాత్రం తగ్గలేదు. గతకొంత కాలంగా శివసేన బిజెపి పార్టీని టార్గెట్ గా చేసి మాటల తూటాలు పేలుస్తోంది. తాజాగా భూసేకరణ బిల్లుపై మొండిగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై శివసేన పార్టీ విరుచుకు పడింది. భూసేకరణ బిల్లును అమలు చేయడం జమ్మూకశ్మీర్ నుంచి ప్రారంభించాలని ఎన్డీఏ సర్కారుకు సవాల్ విసిరింది. మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ బిల్లును కశ్మీర్ లో అమలు చేసే దమ్ముందా అని ప్రశ్నించింది.


శివసేన పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో భూసేకరణ బిల్ పై ఓ ఆర్టికల్ పబ్లిస్ చేసింది.  రైతుల గోడు పట్టించుకోకుండా వారి భూములు లాక్కుకోవడానికి సిద్ధమవుతున్న ఎన్డీఏ సర్కారు... ఆర్టికల్ 370 కారణంగా కశ్మీర్ లో మాత్రం తోక ముడిచిందని తెలిపింది.  జైతాపూర్ న్యూక్లియర్ విద్యుత్ ప్రాజెక్టు కోసం మహారాష్ట్రలో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్న కేంద్ర ప్రభుత్వం.. ఈ సాహసాన్ని కశ్మీర్ లో చేయగలదా అని నిలదీసింది. జమ్మూకశ్మీర్ దేశంలో అంతర్భాగమైనప్పటికీ మనదేశ చట్టాలు అక్కడ అమలు కావడం లేదని శివసేన వాపోయింది. మొత్తానికి శివసేన మరోసారి బిజెపి పార్టీపై విమర్శల వర్షం కురిపించింది. అయితే ఈ సారి భూసేకరణ చట్టానికి జమ్ము కాశ్మీర్ లో ఆర్టికల్ 370కి ముడిపెట్టడం విశేషం.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shivasena  Samna  BJP  landbill  jammu kashmir  

Other Articles