Telangana | MLC | TTDP | TRS | KCR

Telangana tdp party leaders plans to win even one mlc seat in this elections

Telangana, MLC, TTDP, TRS, KCR

Telangana TDP party leaders plans to win even one mlc seat in this elections. TTDP leaders laready went to court for three mlas of their own party, jumped to trs.

తెలంగాణ టిడిపి నేతలు స్కెచ్ వేస్తున్నారు

Posted: 05/27/2015 08:31 AM IST
Telangana tdp party leaders plans to win even one mlc seat in this elections

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఆరు స్థానాలకు ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉండటంతో ఎన్నిక అనివార్యమైంది. టీఆర్ఎస్ ఐదవ అభ్యర్థిని రంగంలోకి దింపడంతో ఈ పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలను తెలంగాణ టీడీపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా ఒక స్థానాన్ని గెలిచి తమ సత్తా చాటాలని తహతహలాడుతున్నారు. తమ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డిని టీడీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మధ్యన జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపర్చిన బీజేపీ అభ్యర్థి ఎన్.రామచంద్రరావు గెలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయం అధికార పార్టీకి షాక్ ఇచ్చింది. ఊహించని ఫలితం ఎదురవడంతో గులాబీ నేతలు కంగుతిన్నారు. ఆ గెలుపు టిడిపి నేతలకు బూస్టింగ్ ఇచ్చినట్టైంది. అదే రీతిలో ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తమ అభ్యర్థిని గెలిపించుకుని సీఎం కేసీఆర్ కు మరోసారి షాక్ ఇవ్వాలని తెలుగు తమ్ముళ్లు పట్టుదలగా ఉన్నారు.

ఇందుకోసం వారు న్యాయబద్దంగా పోరాటం చేస్తూనే సీక్రెట్ ఆపరేషన్ కూడా ప్లాన్ చేశారట. తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి స్వల్ప మెజారిటీ చాలని, అందుకే గెలుపుపై వారు ధీమాగా ఉన్నారని తెలుస్తోంది.గోడ దూకిన ముగ్గురు ఎమ్మెల్యేలపై టీడీపీ నేతలు కోర్టుకెళ్లారు. వారిపై అనర్హత వేటు వేయాలని కోర్టుకు విన్నవించారు. ఒక వేళ కోర్టు తీర్పు వారికి అనుకూలంగా వస్తే మాత్రం టీఆర్ఎస్ ఇబ్బందులు తప్పవు. ఐదవ అభ్యర్థిని గెలిపించుకోవడం కష్టమవుతుంది.ఇక ఆ ఎన్నికల్లో తాము ఓడిపోయినా నష్టమేమీ ఉండదని, కానీ టీఆర్ఎస్ ఓడితే మాత్రం వారికి చిక్కులు తప్పవన్నది తెలుగు తమ్ముళ్లు భావన. దీంతో ఎలాగైనా ఆ ఒక్క స్థానం గెలిచి తీరాలని టీడీపీ పట్టుదలగా ఉంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  MLC  TTDP  TRS  KCR  

Other Articles