అనుకున్నట్టే జరిగింది. ఓటుకు నోటు కేసులో తన అడియో టేపులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన అనంతరం వాటిపై సుమారుగా 24 గంటల పాటు మిన్నకుండిన టీడీపీ అధినేత, నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకంగా మహా సంకల్ప దీక్ష సభా్థలి నుంచి తెలంగాణ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పుల వర్షం కురిపించారు. ఉమ్మడి రాజధానిలో తన ఫోన్లు ట్యాప్ చేసే అధికారం కేసీఆర్కు ఎక్కడిదని, తానేమైనా కేసీఆర్కు సర్వెంటునా అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. తాను ఫోన్ చేశానని తప్పుడు డాక్యుమెంట్లు పెట్టారని, దాన్ని టీ ఛానల్లో ప్రసారం చేశారని అన్నారు. ''మన ఫోన్లు ట్యాప్ చేస్తే ఎంత కడుపు మండిపోతుంది.. చెప్పండి'' అన్నారు. తమ ఎమ్మెల్యేపై తప్పుడు కేసు బనాయించి జైలులో పెట్టారన్నారని అరోపించారు.
చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యంశాలు
* రాష్ట్రాల మధ్య తగాదా వద్దు. టీఆర్ఎస్ ప్రభుత్వం దయచేసి ఆలోచించాలి.
* రేవంత్ రెడ్డి మీద తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు.
* నేను ఫోన్ చేశానని తప్పుడు డాక్యుమెంట్లు రూపొందించారు. ఇది నీ జాగీరా.. కాదు.
* నామీద కుట్ర చేస్తున్నారు. నీతి, నిజాయితీగా బతికాను. ప్రజా సేవ కోసం బతికాను.
* కేసీఆర్ అసమర్థుడు ఏమీ చేయలేకుండా నామీద కుట్ర పన్నుతున్నాడు. అవునా కాదా తమ్ముళ్లూ అని అడుగుతున్నా.
* హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధాని. మీకెంత హక్కుందో, నాకూ అంతే హక్కుంది.
* ఖబడ్దార్, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
* ఐదో అభ్యర్థిని కూడా టీఆర్ఎస్ నిలబెట్టిందంటే అది నీతిమాలిన చర్య కాదా అని అడుగుతున్నాను.
* ప్రభుత్వం అధికారంలో ఉందని స్టింగ్ ఆపరేషన్లు చేయడం, ఫోన్లు ట్యాప్ చేయడం నీచాతి నీచం.
* ఫోన్లు ట్యాప్ చేస్తే ప్రభుత్వాలే పడిపోయాయి.
* ఈరోజు నేను ఒక వ్యక్తిని కాను.. ఏపీ ముఖ్యమంత్రిని. నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం ఈ కేసీఆర్ కి ఎవరిచ్చారని అడుగుతున్నాను.
* నేనేమైనా ఈ కేసీఆర్కి సర్వెంట్నా అని అడుగుతున్నా.
* మీరు మామీద ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లతో నన్ను బెదిరించాలంటే మీ తరం కాదు.
* మీకు ఏసీబీ ఉంటే నాకూ ఏసీబీ ఉంది.
* మీరు హైదరాబాద్ లో ఉన్నారు, నా ఏసీబీ కూడా హైదరాబాద్ లోనే ఉంది.
* మీకు పోలీసులున్నారు, మాకు కూడా పో్లీసులు హైదరాబాద్లోనే ఉన్నారు.
* మా ఎమ్మెల్యేని ఎన్నికలకు ముందు మీ ఫాం హౌస్ కు తీసుకెళ్లి, సిగ్గులేకుండా పోలీసు ప్రొటెక్షన్తో పంపినప్పుడు మీకు సిగ్గులేదా
* శ్రీనివాసయాదవ్ అనే ఎమ్మెల్యేకి మంత్రిపదవి ఇచ్చినప్పుడు యాంటీ డీఫెక్షన్ మీకు గుర్తులేదా?
* 22 మంది ఎమ్మెల్యేలు నాకున్నారు. ఎమ్మెల్సీ నాకో లెక్క కాదు.
* నాకు ఎమ్మెల్సీ ముఖ్యం కాదు.. నీతి ముఖ్యం, సిద్దాంతం ముఖ్యం.
* హైదరాబాద్లో ఆంధ్రావాళ్లను తిడుతూ ప్రతిరోజూ ఇష్టం వచ్చినట్లు ఆంధ్రావాళ్ల ఇళ్లు కూల్చేయడానికి వెళ్తున్నారు.
* మా ఫోన్లు ట్యాప్ చేసినప్పుడు సెక్షన్ 8 ఉంటే, గవర్నర్కు అధికారం ఉంటే మామీద పెత్తనం చేయడానికి మీరెవరని అడుగుతున్నా
* పదేళ్లు ఉమ్మడి రాజధానిలో మనం గౌరవంగా బతికే అధికారం ఉందా లేదా అని అడుగుతున్నా
* ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని, గౌరవం లేని మాటలంటారా, అగౌరవ పరుస్తారా? నన్ను కాదు మీరు అగౌరవ పరిచేది.. ఐదుకోట్ల ప్రజలనని తెలుసుకోండి
*. మా ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు మీకు బుద్ధి లేదా?
* సమయం వచ్చినప్పుడు ఒక్కో అస్త్రం వదులుతా.
* టీఆర్ఎస్ పార్టీ పెత్తనంపై నేను ఆధారపడలేదు, వీళ్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడలేదు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more