ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డంగా దోరికిన తరువాత కూడా గాయ్ చేసిన పెడబోబ్బలు పెడతున్నాడని బోంకుతున్నాడని, ఆయనను ఆ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని, ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏ శాస్తి కావాలో ఆ శాస్తి తప్పక జరుగుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హైదరాబాద్లో చంద్రబాబుకు ఏసీబీ ఉండొచ్చు గానీ, తాను మాత్రం ఆయనలా దొంగను కానని స్పష్టం చేశారు. హైదరాబాద్ పై హక్కుల గురించి మాట్లాడుతున్న చంద్రబాబు.. హైదరాబాద్ నీ అబ్బ జాగీరా అంటూ మండిపడ్డారు. మంగళగిరిలో నిర్వహించిన మహా సంకల్ప సభలో చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలకు సీఎం కేసీఆర్ దీటుగా సమాధానమిచ్చారు. పట్టపగలు నగ్నంగా దొరికిపోయిన దొంగవు..ఇంకా నువ్వు మాట్లాడేదేంటని నిలదీశారు.
''పక్కరాష్ట్రం వాడివి నువ్వు.. అలాంటిది మా ఎమ్మెల్యేలను కొంటే చూస్తూ ఊరుకోవాలా? చేతులకు గాజులు తొడిగించుకుని కూర్చోవాలా? అంటూ ప్రశ్నించారు. నీతి నిజాయితీ గురించి అనుక్షణం మాట్లాడుతున్న చంద్రబాబు టీడీపీ పార్టీకి.. అసలు ఎమ్మెల్సీని గెలిపించుకునే బలం లేదని తెలిసి కూడా పోటీ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. లంచం ఇవ్వడానికి ప్రయత్నిస్తే, తమ పార్టీకి చెందిన తెలంగాణ బిడ్డ స్టీఫెన్సన్ విషయం ఏసీబీకి చెప్పి మిమ్మల్ని పట్టించాడన్నారు. అయినా రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పనట్లు.. సొంత రాష్ట్రం వచ్చినా చంద్రబాబు బాధ మాకు తప్పడం లేదన్నారు.
హైదరాబాద్కు హక్కుల గురించి మాట్లాడే చంద్రబాబు.. హైదరాబాద్ కు ముఖ్యమంత్రి ఎవరన్న విషయం తెలుసుకోవాలని..సూచించారు. నగ్నంగా.. పచ్చిగా పట్టపగలు దొరికిపోయావ్.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా చంద్రబాబు బాగోతం బయటపడిందని దుయ్యబట్టారు. సత్య హరిశ్చంద్రుడి ఇంటి వెనుక నీ ఇల్లు ఉందిగా.. నువ్వెందుకు చేసినవీ పని? అరువులతో ఏం చేయలేవు.. తెలంగాణ గడ్డపై చంద్రబాబు కిరికిరి చెల్లదని హెచ్చరించారు. తెలంగాణలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోడానికి తమకు రోజుకు 24 గంటలు సరిపోవడంలేదని... రోజుకు 18-20 గంటలు పనిచేయాల్సి వస్తోంది. అలాంటిది ఆయన గురించి పట్టిచుకోవాల్సిన ఖర్మ తమకేంటని నిలదీశారు? ఇక్కడ కూడా అడ్డగోలు రాజకీయాలు చేస్తున్నాడని. ఏసీబీకి పట్టుబడితే, ఇరికిస్తున్నారని చంద్రబాబు అంటున్నారని ఇరికిస్తే ఇరికిపోతాడా.. చంద్రబాబు అంటూ వ్యంగంగా వ్యాఖ్యానించారు కేసీఆర్
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more