Governor | Chandrababu Naidu | Ap | narasimhan

Ap cm chabdrababu naidu supported to governor narasimhan

Governor, Chandrababu Naidu, Ap, narasimhan, Section8, Hyderabad, Achennaidu, Congress

Ap cm Chabdrababu naidu supported to Governor narasimhan. Chandrababu Naidu instructs to his cader to dont give any statements aganist to the Governor.

గవర్నర్ కు అండగా చంద్రబాబు

Posted: 06/19/2015 01:44 PM IST
Ap cm chabdrababu naidu supported to governor narasimhan

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ మీద విమర్శల వర్షం కురుస్తోంది. అటు తెలుగుదేశం పార్టీ నేతలు, ఇటు కాంగ్రెస్ నాయకులు గవర్నర్ మీద మాటల తూటాలు పేలుస్తున్నారు. అయితే మంత్రి అచ్చెన్నాయుడు ఏకంగా గంగిరెద్దని అనడంతో వివాదం ముదిరింది. ఒక గవర్నర్ ను అలా అనడం ఏంటా అని సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే దానిపై అచ్చెన్నాయుడు క్షమాపణలు కోరారు. కానీ తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు తారా స్థాయికి చేరడంతో గవర్నర్ నరసింహన్ దిగిపోవాలని చేత కానివాడని రకరకాలుగా విమర్శలు వస్తున్నాయి. అయితే మొన్నటి దాకా గవర్నర్ మీద గుర్రుగా ఉన్న చంద్రబాబు నాయుడు తాజాగా ఆయనకు బాసటగా నిలుస్తున్నారు. గవర్నర్ పని తీరు ఏం బాగొలేదని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన చంద్రబాబు నాయుడు అదే గవర్నర్ కు అండగా నిలబడటం విశేషం.

అయితే చంద్రబాబు నాయుడు తాజాగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు గవర్నర్ గురించి క్లాస్ తీసుకున్నారట. గవర్నర్ గురించి ఎవరూ నోరు జారవద్దని హితవు పలికినట్లు సమాచారం. అయితే దీని వెనకాల వేరే కోణం కూడా ఉందని కొంత మంది అనుకుంటున్నారు. హైదరాబాద్ లో సెక్షన్8 అమలు కావాలంటే గవర్నర్ నరసింహన్ లాంటి వారైతేనే కరెక్ట్ అని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడుతున్నారని, అందుకే ఈ కీలక సమయంలో గవర్నర్ కు వ్యతిరేకంగా ఎలాంటి మాటలు మాట్లాడవద్దని తన క్యాడర్ కు నిర్దేశించారని సమాచారం. మొత్తానికి నిన్నటి దాకా కారాలు మిరియాలు నూరిన చంద్రబాబు తాజాగా గవర్నర్ కు బాసటగా నిలవడం నిజంగా విశేషమే.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Governor  Chandrababu Naidu  Ap  narasimhan  Section8  Hyderabad  Achennaidu  Congress  

Other Articles