Rapist | Eluru | Westgodavari | Suresh | People | Police

People attacked on rapist and killed brutally in eluru of westgodavari

Rapist, Eluru, Westgodavari, Suresh, People, Police

people attacked on rapist and killed brutally in eluru of westgodavari. People attacked on a rapist who raped and killed a seven years old girlbrutally.

ITEMVIDEOS: ఆ కామాంధుడిని కొట్టి చంపారు

Posted: 06/19/2015 03:13 PM IST
People attacked on rapist and killed brutally in eluru of westgodavari

ఇది జనం తీర్పు.జనాలు తిరగబడితే రూల్స్ ఏవీ అడ్డురావు. ఎవరూ అడ్డుకోరు అన్న విషయాన్ని నిరూపించిందో ఘటన. ఏడు సంవత్సరాల చిన్నారిని కామంతో కళ్లు మూసుకున్న ఓ కామ పిశాచికి తగిన శాస్ర్తి చేశారు జనం. న్యాయం గెలవాలంటే పోలీసులు రూల్స్ పాటించాలి.. కానీ అదే న్యాయం కోసం జనం ఏ రూల్స్నైనా బ్రేక్ చేస్తారు. ఏడేళ్ల బాలికను రేప్ చేసి చంపేసిన కిరాతకుడికి జనాలు మరణదండన వేశారు. అది మామూలుగా కాదు రోడ్డు మీద కొట్టి కొట్టి చితకబాది రక్తం కళ్ల చూసి చంపేశారు. జనం సహనం కోల్పోతే ఎలా ఉంటుంది అన్న దానికి నిలువు సాక్షం పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది. అందరూ కలిసి కసిగా.. పోలీసులు ఆపుతున్నా... ఆ కామాంధుడు తల్లడిల్లినా అతిదారుణంగా చావబాది ప్రాణాలు తీశారు.

 పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం వెంకటాపురంలో ఏడేళ్ల చిన్నారి లావణ్య పై అత్యాచారం చేసి తర్వాత హత్యచ చేసిన సురేశ్ అనే వ్యక్తిని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న సురేష్ ను గ్రామస్థులు బలవంతంగా లాక్కుని దాడికి దిగారు. అయితే జనం కొడుతున్న దెబ్బలకు తాళలేక నిందితుడు సురేశ్ ఏలూరు బస్టాండ్ సెంటర్ లోని ప్లై ఓవర్ పై నుంచి దూకేశాడని, అయినా వదిలిపెట్టకుండా స్థానికులు దాడి చేసి రైలు పట్టాలపై పడేసి చావబాదారు. సురేశ్ పై పిడిగుద్దులు కురిపించి, కాళ్లతో తన్నారు. ఆ దెబ్బలకు చివరికి సురేష్ చనిపోవటంతో స్థానికులను చెరదగొట్టి పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.మొత్తానికి కామంతో కళ్లు మూసుకుని కన్నూ మిన్నూ ఎరుగని కామాంధుడికి జనం విధించిన శిక్ష సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rapist  Eluru  Westgodavari  Suresh  People  Police  

Other Articles